జిల్లాకు మరో 50 విద్యుత్ బస్సులు
తిరుపతి అర్బన్: బస్సుల కండీషన్‌కు తొలి ప్రాధాన్యత ఇస్తామని ఆర్టీసీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్(ఈడీ) తిమ్మాడి చెంగల్‌రెడ్డి తెలిపారు. శనివారం విజయవాడ నుంచి విచ్చేసిన ఆయన తిరుపతిలోని డీపీటీఓ కార్యాలయంలో డిపో మేనేజర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలతోపాటు అన్ని ప్రాంతాల్లో ప్రమాదాలకు తావులేకుండా ఆర్టీసీ సర్వీసుల కండీషన్‌పై ప్రతి డీఎం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మరోవైపు రాష్ట్రంలో 750 విద్యుత్ సర్వీసులు కొత్తవి రానున్నాయని వెల్లడించారు. అందులో తిరుపతికి 50 సర్వీసులు కేటాయిస్తామన్నారు. మంగళం డిపో కేంద్రంగా కొత్తగా వచ్చే విద్యుత్ బస్సుల ఆపరేటింగ్ ఉంటుందని వివరించారు. మరోవైపు జిల్లాలో 11 ఆర్టీసీ డిపోల పరిధిలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డీపీటీఓ నరసింహులు, పీఓ సహజాన్, ఏటీఎం డీఆర్ నాయుడు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment