చోరీ సొత్తు స్వాధీనం
నారాయణవనం: మండలంలో రెండు వెర్వేరు దొంగతనాల కేసుల్లో నారాయణవనానికి చెందిన గోపి(26)ని అరెస్ట్ చేసి 44 గ్రాముల బంగారం, 120 గ్రాముల వెండితో పాటు రూ.80 వేలు రికవరీ చేసినట్లు పుత్తూరు డీఎస్పీ రవికుమార్ తెలిపారు. ఈ మేరకు పుత్తూరు డీఎస్పీ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశంలో ముద్దాయిని, రికవీ సొత్తును, నగదును ప్రదర్శించారు. రవికుమార్ మాట్లాడుతూ మండలంలోని జగనన్న కాలనీలో తాళం వేసిన నవీన్ ప్రకాష్ ఇంట్లో ఫిబ్రవరి ఒకటవ తేదీన, నారాయణవనం తేరువీధిలో తాళం వేసిన అమవావతి ఇంట్లో ఫిబ్రవరి 17వ తేదీన దొంతనాలు జరిగినట్లు తెలిపారు. రూరల్ సీఐ రవీంద్ర, ఎస్‌ఐ రాజశేఖర్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారన్నారు. పక్కా సమాచారం రావడంతో సోమవారం మధ్యాహ్నం స్థానిక వైఎస్సార్ సర్కిల్ వద్ద దామును అదుపులో తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడిందన్నారు. స్వల్ప వ్యవధిలో కేసును ఛేదించిన సీఐ రవీంద్ర, ఎస్‌ఐ రాజశేఖర్, ఏఎస్‌ఐ జయరాం నాయక్, క్రైమ్ సిబ్బంది దాము, మోహన్, హెచ్‌సీ రాజేష్, కానిస్టేబుళ్లు భాస్కర్, శ్రీనాఽథ్‌ను ఈ సందర్భంగా డీఎస్పీ రవికుమార్ అభినందించి, రివార్డులను అందజేశారు.
ఎస్వీయూ డీడీఈ డైరెక్టర్‌గా రమేష్‌బాబు
తిరుపతి సిటీ: ఎస్వీ యూనివర్సిటీ దూరవిద్య విభాగం ఇన్‌చార్జి డైరెక్టర్‌గా ఆచార్య ఊకా రమేష్ బాబు నియమితులయ్యారు. ఆయన సోమవారం వీసీ ఆచార్య అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు నుంచి నియామక పత్రం అందుకున్నారు. రమేష్ బాబు మాట్లాడుతూ దూరవిద్య పరీక్షలను త్వరగా నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశించారని తెలిపారు. అదేవిధంగా 2024–25కు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ వచ్చేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. డీడీఈ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయనను అధ్యాపకులు పీసీ వెంకటేశ్వర్లు, ఎన్‌సీ రాయుడు, కిశోర్, ప్రయాగ, కోఆర్డినేటర్ హరికృష్ణ యాదవ్ అభినందించారు.
చోరీ సొత్తు స్వాధీనం
Comments
Please login to add a commentAdd a comment