తిరుపతి ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా సోమవారం జిల్లా వ్యాప్తంగా 86 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ద్వితీయ సంవత్సర విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్–2 పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు జనరల్‌లో 28,322 మంది, ఒకేషనల్‌లో 1,033 మంది మొత్తం 29,335 మంది విహాజరవ్వాల్సి ఉంది. అయితే వీరిలో 572 మంది విద్యార్థులు గైర్హాజరైనట్టు ఆర్‌ఐఓ జీవీ.ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఇంగ్లిష్ పేపర్–1 ఉంటుందన్నారు.
పకడ్బందీగా నేర నియంత్రణ
తిరుపతి క్రైమ్: జిల్లాలో ఎన్‌ఫోర్స్‌మెంట్ విధులను పెంచి నేర నియంత్రణ కట్టడి చేసినట్లు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఫిబ్రవరిలో సాధించిన పురగతిని ఆయన వెల్లడించారు. రాత్రిపూట రోడ్లపై తిరుగుతున్న 1,484 మంది అనుమానిత వ్యక్తులను పోలీస్ స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపినట్టు పేర్కొన్నారు. అలాగే 94.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. రోడ్లను ఆక్రమించి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే 2,222 మంది చిరు వ్యాపారులపై టౌన్ న్యూసెన్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment