అరెస్ట్‌లు..నిరసనలు!
తిరుపతి అర్బన్: అంగన్‌వాడీ వర్కర్లతో కూటమి ప్రభుత్వం చెడుగుడు ఆడుతోంది. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా.. శాంతియుతంగా ధర్నా నిర్వహించేందుకు విజయవాడకు బయలుదేరిన వారిపై ఝులుం ప్రదర్శించింది. ఎక్కడికక్కడ అరెస్ట్‌లకు పూనుకుంది. ఇది చాలదన్నట్టు హౌస్ అరెస్ట్‌లూ చేసి నరకం చూపించింది.
సెక్టార్ సమావేశాల్లోనే నిరసన
జిల్లాలోని 11 ఐసీడీఎస్ సెంటర్లలో సోమవారం సెక్టార్ సమావేశాలు నిర్వహించారు. సాదారణంగా సెక్టార్ సమావేశం ప్రతి నెలా 25వ తేదీ పైన నిర్వహిస్తుంటారు. కానీ విజయవాడలో సోమవా రం జరిగిన మహాధర్నాకు వెళ్లకుండా కుయుక్తులు పన్నారు. సెక్టార్ సమావేశాన్ని సోమవారమే ఏర్పాటు చేశారు. జిల్లాలో 2,092 మంది అంగన్‌వాడీ వర్కర్లుండగా.. అందులో 500 మంది వరకు విజయవాడకు వెళ్లారు. మిగిలిన వారు సెక్టార్ సమావేశాల్లోనే నిరసన వ్యక్తం చేశారు.
అండగా ఉంటామని!
ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చంద్రబాబునా యుడు, నారా లోకేష్ అంగన్‌వాడీలకు అండగా ఉంటామని హామీలిచ్చారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఇలా ఇబ్బందులకు గురిచేస్తున్నారని పలువురు అంగన్‌వాడీ వర్కర్లు వాపోయారు.
అరెస్ట్‌లు..నిరసనలు!
Comments
Please login to add a commentAdd a comment