దుగరాజుపట్నం పోర్టు నిర్మాణం అంతేనా?
● పార్లమెంట్‌లో గళమెత్తిన ఎంపీ గురుమూర్తి
తిరుపతి మంగళం : తిరుపతి పార్లమెంటు పరిధిలోని దుగరాజపట్నం పోర్టు నిర్మాణ పరిస్థితి ఏంటని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. సోమవారం లోక్ సభలో ఆయన మాట్లాడారు. 2014 పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న దుగరాజపట్నం నౌకాశ్రయ అభివృద్ధి ఇంకా ప్రారంభం కాలేదన్నారు. 2018 నాటికే మొదటి దశ నిర్మాణం పూర్తి కావాల్సి ఉందన్నారు. దీనిని తక్షణమే ప్రారంభించి, రాష్ట్ర సముద్ర వాణిజ్య అభివృద్ధిని వేగవంతం చేయాలని కోరారు. ఆధునిక సాంకేతికతను సద్వినియోగం చేసుకోకపోవడం లోపంగా కనిపిస్తోందన్నారు. ఈ–బిల్స్ ఆఫ్ లేడింగ్ అమలు చేయడం ద్వారా సముద్ర రవాణా మెరుగుపడుతుందని గుర్తుచేశారు.
2 నుంచి డీడీఈ పరీక్షలు నిర్వహించండి
తిరుపతి సిటీ: ఎస్వీయూ డీడీఈ పరీక్షలను వచ్చే నెల 2వ తేదీ నుంచి నిర్వహించాలని వర్సిటీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే పలు మార్లు వాయిదా పడిన పరీక్షలను ఈ నెల 17వ తేదీ నుంచి నిర్వహించాలని కోర్టు గతంలో ఆదేశాలు జారీచేయగా, పదో తరగతుల నేపథ్యంలో పరీక్షలను నిర్వహించలేమని వర్సిటీ అధికారులు కోర్టుకు విన్నవించారు. అన్ని విషయాలను పరిశీలించిన ధర్మాసనం ఈ మేరకు షెడ్యూలు విడుదల చేయాలని అధికారులను ఆదేశించింది.
రేపటి నుంచి
ఏపీఈసెట్‌కు దరఖాస్తులు
తిరుపతి సిటీ: ఏపీ ఈసెట్–2025 నోటిఫకేషన్ విడుదలైంది. బుధవారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. బీటెక్ కోర్సులో రెండవ ఏడాదిలో నేరుగా ప్రవేశం పొందేందుకు నిర్వహించే ఏపీఈసెట్‌కు వచ్చేనెల 7వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ప్రకటించారు. ఇంజీరింగ్ అండ్ టెక్నాలజీలో డిప్లొమో, బీఎస్సీ (గణితశాస్త్రం)లో డిగ్రీ ఫైనల్ ఇయిర్ చదువుతున్న, పూర్తి చేసిన అభ్యర్థులు ఏపీఈసెట్ పరీక్షకు అర్హులని తెలిపారు. ప్రవేశ పరీక్ష మే 6వ తేదీన నిర్వహించనున్నారు.
ఈకేవైసీకి 18 వరకు గడువు
తిరుపతి అర్బన్:ఈకేవైసీ చేయించుకోవడానికి రైతులకు ఈ నెల 18వ తేదీ వరకు గడువు ఉందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి ప్రసాద్‌రావు సోమవారం తెలిపారు. రబీ సీజన్‌కు సంబంధించి 2,03,860 ఎకరాలకు చెందిన 72,966 మంది రైతులకు ఈ పంట నమోదు చేశామని చెప్పారు. అలాగే 1,94,696 ఎకరాలకు సంబంధించి 69,166 మంది రైతులకు ఈకేవైసీ చేయాల్సి ఉందని వెల్లడించారు. 18వ తేదీ వరకు చేయించుకున్న వారి జాబితాను ఈనెల 22న ప్రకటిస్తామని తెలిపారు.
కురుణామయుడా.. కనికరించు!
తిరుపతి సిటీ: గౌరవవేతనం పెంచాలంటూ గత 36 రోజులుగా పశువైద్య విద్యార్థులు తరగతులు బహిష్కరించి వినూత్న రీతిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం స్థానిక వెస్ట్ చర్చిలో వెటర్నరీ జూడాలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వారు మట్లాడుతూ నెల రోజులకు పైగా ఆకలి కేకలతో ధర్నాలు, నిర సనలు చేస్తున్నా అధికారులు, ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్‌పై స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారమయ్యే వరకు సమ్మె విరిమించేది లేదని హెచ్చరించారు.
వేదవిజ్ఞానానికి ప్రత్యేక వెబ్‌సైట్
తిరుపతి సిటీ: వేద విజ్ఞానాన్ని డిజిటలైజేషన్ చేసి ప్రపంచానికి అందించేందుకు వేదం.ఓఆర్‌జీ పేరుతో ప్రత్యేక వెబ్‌సైటన్‌ను జాతీయ సంస్కృత వర్సిటీలో అధికారులు లాంఛనంగా ప్రారంభించారు. వర్సిటీలో ఖండనఖండఖాద్య గ్రంథాధ్యయనంపై పది రోజుల పాటు జరగనున్న అంతర్జాతీయ వర్కషాపులో భాగంగా ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. శ్రీసత్యసాయి వేదప్రతిష్ఠానం, న్యాసీ ప్రబంధకులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కేఆర్ పరమహంస, వీసీ జీఎస్‌ఆర్ కృష్ణమూర్తి, డీన్ రజనీకాంత్ శుక్లా, ప్రొఫెసర్ గణపతిభట్, అధ్యాపకులు సతీష్, నాగరాజు భట్, మనోజ్‌షిండే, శివరామ దాయగుడే పాల్గొన్నారు.
దుగరాజుపట్నం పోర్టు నిర్మాణం అంతేనా?
దుగరాజుపట్నం పోర్టు నిర్మాణం అంతేనా?
Comments
Please login to add a commentAdd a comment