వాళ్లు ఉండరు..
సచివాలయాలు వెలవెల
● మహాత్మా గాంధీ కలలకు కూటమి నేతల తూట్లు ● చిన్న సమస్యలకూ కలెక్టరేట్‌కు పరుగులు ● క్షేత్ర స్థాయిలో ఎక్కడి సమస్యలు అక్కడే ● ఆపసోపాలు పడుతున్న ప్రజలు
‘క్షేత్ర స్థాయిలోనే సమస్యలు పరిష్కరించాలి. ఉద్యోగులు సైతం ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కారమవ్వాలి..’ అన్న లక్ష్యంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. ఇది ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారింది. కూటమి ప్రభుత్వం వచ్చాక మహాత్మాగాంధీ కలలకు తూట్లు పొడుస్తోంది. సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది. సర్వేల పేరుతో సిబ్బందిని ముప్పుతిప్పలు పెడుతోంది. చిన్న సమస్యకూ ప్రజలు సుదూర ప్రాంతంలోని కలెక్టరేట్‌కు పరుగులు పెట్టేలా చేస్తోంది. ఏం చేయాలో తెలియక.. తమ బాధలు ఎక్కడ చెప్పుకోవాలో అర్థంగాక జనం నలిగిపోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
సిబ్బంది లేని చిట్టమూరు మండలంలోని ఆరూర్ సచివాలయం
ఖాళీగా వరదయ్యపాళెంలోని సీఎల్‌ఎన్‌పల్లి గ్రామ సచివాలయం
జిల్లా సమాచారం
సచివాలయాలు 619
సచివాలయ ఉద్యోగులు 7,405
రూరల్‌లో సచివాలయాలు 495
సచివాలయ ఉద్యోగులు 5,445
అర్బన్ పరిధిలో సచివాలయాలు 196
సచివాలయ ఉద్యోగులు 1,960
వికలాంగుల పింఛన్ కోసం వచ్చా
నాది తిరుపతిలోని చింతలచేను. నా పేరు పీ.మంగమ్మ. నా భర్త పేరు వెంకటేష్. వికలాంగుల పింఛన్ కోసం కలెక్టరేట్‌కు వచ్చాం. సచివాలయంలో ఎవ్వరూ అందుబాటులో లేరు. మేము కటిక పేదవాళ్లం. దానికితోడు వికలాంగురాలుని. పింఛన్‌కు అర్హత ఉంది. న్యాయం చేయాలి.
పింఛన్ ఇవ్వడంలేదయ్యా!
నా పేరు కోనేటి రోసయ్య. మాది కేవీబీపురం మండలంలోని కోవనూరు ఎస్టీకాలనీ. వృద్ధాప్య పింఛన్ కోసం తిరుగుతున్నా. రెండు వారాలుగా కలెక్టరేట్‌కు వస్తున్నా. మా గ్రామం నుంచి కలెక్టరేట్‌కు రావాలంటే 70 కి.మీ. మా కష్టాన్ని గుర్తించాలి.
తిరుపతి అర్బన్: సచివాలయ వ్యవస్థకు కూటమి నేతలు తూట్లు పొడుస్తున్నారు. సర్వేల పేరుతో సిబ్బందిని ప్రజలకు దూరం చేస్తున్నారు. ఇంటి వద్దే అందుతున్న సేవలను అందకుండా అడుగడుగునా అడ్డుపడుతున్నారు. ఫలితం చిన్న సమస్యకూ విధిలేని పరిస్థితుల్లో కలెక్టరేట్‌కు వెళ్లాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీరు, వీధిలైట్లు, దారి సమస్య, సర్టిఫికేట్స్, రేషన్‌కార్డులు, ఫించన్లు, పాఠశాలల్లో కొళాయిల మరమ్మతులు ఇలా.. అన్నింటికీ కలెక్టరేట్‌కు వెళ్తున్నారు. కూటమి ప్రభుత్వంలో 2024 డిసెంబర్ 2వ తేదీ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 82 అర్జీలు వచ్చాయి. ప్రస్తుతం మార్చి 10వ తేదీ ఆ అర్జీల సంఖ్య 265కి చేరింది. మూడు రెట్లు అర్జీలు పెరిగాయి. రాబోవు రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
పీఎంజేఏవై కార్డు కోసం తిరుగుతున్నా
నా పేరు గూడూరు అయ్యప్ప. నా కుమారుడు గూడూరు దయాకర్ 5వ తరగతి చదువుతున్నాడు. పదేళ్ల వయస్సులోనే గుండె సమస్యతో బాధపడుతున్నాడు. ఆస్పత్రులకు వెళితే పెద్ద మొత్తంలో ఖర్చవుతుందని చెప్పారు. పీఎంజేఏవై కార్డు ఉంటే ఉచితంగా ఆపరేషన్ చేస్తామని చెప్పారు. గతంలో ఈ కార్డును సచివాలయ పరిధిలోనే ఇచ్చేవారు. ప్రస్తుతం వారు ఇవ్వడం మానుకున్నారు. దీంతో రెండు వారాలుగా పీఎంజేఏవై కార్డు కోసం కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా.
రేషన్ కార్డు కోసం వచ్చాం
నా పేరు పీ.నాగయ్య. నా భార్యపేరు పీ.మురగమ్మ. మాది వడమాలపేట మండలంలోని బట్టికండ్రిగ గ్రామం. మాకు రేషన్‌కార్డు లేదు. సచివాలయానికి వెళితే అక్కడ ఎవ్వరూ ఉండడం లేదు. దీంతో మూడు వారాలుగా అన్ని పనులు వదులుకుని కలెక్టరేట్‌కు వస్తున్నాం. మేము చాలా పేదవాళ్లం. మాకు రేషన్ కార్డు ఇప్పించాలని కోరుతున్నాం.
వాళ్లు ఉండరు..
వాళ్లు ఉండరు..
వాళ్లు ఉండరు..
వాళ్లు ఉండరు..
వాళ్లు ఉండరు..
వాళ్లు ఉండరు..
వాళ్లు ఉండరు..
Comments
Please login to add a commentAdd a comment