రాష్ట్ర స్థాయి హాకీ పోటీల్లో జిల్లా జట్టు విజయం
తిరుపతి ఎడ్యుకేషన్ : గుంటూరు ఏఎన్‌యూలో ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి సీనియర్ మెన్ హాకీ పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా సోమవారం ప్రతిభ కనబరిచిన తిరుపతి, సత్యసాయి జిల్లా జట్లు ఫైనల్‌కు చేరాయి. హోరాహోరీగా తలపడ్డ ఫైనల్ పోటీల్లో సత్యసాయి జిల్లా జట్టుపై 6–2గోల్స్ తేడాతో తిరుపతి జిల్లా జట్టు విజయం సాధించినట్టు ఏపీ హాకీ సంఘం ప్రధాన కార్యదర్శి హర్షవర్ధన్, ఏపీ హాకీ డైరెక్టర్ నిరంజన్‌రెడ్డి చేతుల మీదుగా ట్రోఫీని అందుకుంది. ఈ పోటీల్లో తిరుపతి జిల్లా జట్టు బ్యాక్ క్రీడాకారుడు శ్రీనివాసులురెడ్డి(చంద్రగిరి), సెంటర్ హాఫ్ క్రీడాకారుడు సందీప్(గూడూరు) ఓవరాల్ ప్రతిభ కనబరిచి బెస్ట్ ప్లేయర్స్ అవార్డులను అందుకున్నారు. ప్రతిభ కనబరచిన జిల్లా జట్టు, క్రీడాకారులను జిల్లా హాకీ జట్టు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు స్పర్ధన్‌రాజు, బీ.ఆదిత్య, కోచ్‌లు దీపక్ ఆకాష్, అశోక్, రమేష్, జెర్సీ స్పాన్సర్లు వీఎన్ మొబైల్స్ అప్పు, వెంకట్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment