ఏప్రిల్ 30న పాలిసెట్ ప్రవేశ పరీక్ష
తిరుపతి ఎడ్యుకేషన్ : పదో తరగతి విద్యార్హతతో పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సుల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 30వ తేదీన పాలిసెట్–2025 ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఆ మేరకు తిరుపతి కేటీ రోడ్డులోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపల్, జిల్లా కో–ఆర్డినేటర్ ఆర్‌వీ.రమణకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా తిరుపతి జిల్లాకు సంబంధించి తిరుపతి, సత్యవేడు, గూడూరులో ఏర్పాటుచేయనున్న పరీక్షా కేంద్రాల్లో పాలిసెట్‌ను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పరీక్షకు పదో తరగతి పాసైన విద్యార్థులు, ప్రస్తుతం పది పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. పాలిసెట్ ప్రవేశ పరీక్షకు సంబంధించి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఉచితంగా శిక్షణతో పాటు మెటీరియల్‌ను అందించనున్నట్లు తెలిపారు. పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఏపీపీఓఎల్‌వైసీఈటీ.ఏపీ.ఎన్‌ఐసీ.ఇన్’ వెబ్‌సైట్ ద్వారా ఏప్రిల్ 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.100, బీసీ, ఓసీ విద్యార్థులు రూ.400పరీక్ష ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకోదలచిన విద్యార్థులు సమీపంలోని ఏదేని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సంప్రదించవచ్చని, అలాగే తిరుపతిలోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటుచేసిన హెల్ప్‌లైన్ సెంటర్‌లో సంప్రదించవచ్చని తెలిపారు. వివరాలకు 99851 29995 నంబరులో హెల్ప్‌లైన్ సెంటర్ ఇంచార్జ్ కమల్‌ను సంప్రదించాలని ఆయన కోరారు.
శ్రీవారి దర్శనానికి 8 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 8 కంపార్ట్‌మెంట్లు నిండాయి. బుధవారం అర్ధరాత్రి వరకు 68,509 మంది స్వామివారిని దర్శించుకోగా 23,509 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.86 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment