● చెదులుపాకం చెరువులో మొదలైన గ్రావెల్ తవ్వకాలు ● తమిళ
వరదయ్యపాళెం: సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాళెం మండలంలోని చెదులుపాకం వద్ద చెరువులో ఇష్టారాజ్యంగా భారీ యంత్రాలతో మట్టిని తవ్వేస్తున్నారు. నియంత్రించాల్సిన రెవెన్యూ, పోలీస్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. స్థానికులు అడ్డుపడుతున్నా అధికారుల సహకారం లేకపోవడంతో ప్రయోజనం లేకుండా పోతోంది. అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారితో ఒప్పందం కుదుర్చుకున్న అధికారులు మాత్రం తమకేమీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. అంతేకాక అక్రమంగా అనుమతులను ఇస్తూ మాఫియాకు మద్దతు పలకడం విమర్శలకు దారి తీస్తోంది. గ్రామస్తుల విన్నపాలను పట్టించుకోని అధికారులు గ్రావెల్ మాఫియాను ప్రోత్సహించడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇంతజరుగు తున్నా మైనింగ్ అధికారులు పత్తా లేకుండా పోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం వ్యవహారానికి టీడీపీ స్థానిక నేతలే కారణమని ఆరోపిస్తున్నారు. తమ జేబులు నింపుకునేందుకు చెరువును ధ్వంసం చేస్తున్నారని మండిపడుతున్నారు.
కాలనీకి ముప్పు
చెదులుపాకం వద్ద ఇల్లు లేని నిరుపేదల కోసం గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జగనన్న కాలనీ ఏర్పాటు చేశారు. పేదలకు పట్టాలు పంపిణీ చేయ గా కొంతమంది ఇళ్లు కూడా నిర్మించుకున్నారు. అయితే ప్రస్తుతం జగనన్న కాలనీకి సమీపంలోని చెదులుపాకం చెరువులో భారీగా తవ్వకాలు చేపడుతున్న కారణంగా వర్షాకాలంలో తమ నివాసాలకు ముప్పు తప్పదని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాక జగనన్న కాలనీ మీదుగా వందలాది వాహనాలు గ్రావెల్ లోడ్‌తో రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో దారులు సైతం ధ్వంసమవుతున్నట్లు వాపోతున్నారు.
మట్టి కోసం వేచి ఉన్న టిప్పర్లు
తెర వెనుక తమ్ముళ్లు
చెదులుపాకం చెరువు వద్ద సాగుతున్న గ్రావెల్ దందా వెనుక మండలానికి చెందిన ఓ వర్గం టీడీపీ కీలక నేతలు ఉన్నట్లు గ్రామస్తులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. వీరి అండదండలతోనే తమిళనాడుకు మట్టి అక్రమ రవాణా జరుగుతోందని స్పష్టం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల పేరిట అక్రమంగా అనుమతులు తీసుకుని గ్రావెల్ దోపిడీకి శ్రీకారం చుట్టారని విమర్శిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment