మొల్లమాంబకు ఘన నివాళి
తిరుపతి మంగళం : వాల్మీకి మహర్షి రాసిన సంస్కృత భాషల నుంచి తెలుగులోకి అత్యంత రమణీయంగా రాసిన మొట్టమొదటి మహిళా కవయిత్రి మొల్లమాంబ అని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి కొనియాడారు. ఈ మేరకు తిరుపతి పద్మావతిపురంలోని ఆయన నివాసం వద్ద గురువారం కవయిత్రి మొల్లమాంబ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పుష్పాలతో నివాళి అర్పించారు. ఎంపీపీ యశోదమ్మ, సర్పంచ్ చిన్నియాదవ్, ఎంపీటీసీలు జైకర్, నాగభూషణమ్మ, వైఎస్సార్‌సీపీ నాయకులు రుద్రగోపి, వాసు, సుబ్రమణ్యం పాల్గొన్నారు.
ఘనంగా మొల్ల జయంతి
తిరుపతి అర్బన్: కవయిత్రి మొల్ల రచనా శైలి ఎంతో సరళమైందని, రమణీయమైనదని డీఆర్వో నరసింహులు పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లో ఆమె జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాల్మీకి రచించిన రామాయణాన్ని సంస్కృతం నుంచి సామాన్యులకు అర్థమయ్యే విధంగా తెలుగు భాషలోకి అనువధించిన కవయిత్రి మొల్ల అని కొనియాడారు. కడప జిల్లా, గోపవరం గ్రామంలో కుమ్మరి కుటుంబంలో జన్మించిన మొల్ల 16వ శతాబ్దపు తెలుగు కవయిత్రిగా ప్రత్యేక గుర్తింపు పొందారని తెలిపారు. జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిణి జ్యోత్స్న, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోజ్‌మాండ్, జిల్లా సమాచార పౌరసంబంధాల శాఖ అధికారి బాలకొండయ్య పాల్గొన్నారు.
మొల్లమాంబకు ఘన నివాళి
Comments
Please login to add a commentAdd a comment