యువత పోరు విజయవంతం
తిరుపతి మంగళం : వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద చేపట్టిన యువత పోరు విజయవంతం అయిందని, ఇందులో పాల్గొన్న విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు, పార్టీ శ్రేణులకు చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వయువతపోరులో పాల్గొని కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై విద్యార్థులు, యువత ఉద్యమించిందన్నారు.
ఇన్‌చార్జి సీవీఎస్‌ఓ బాధ్యతల స్వీకరణ
తిరుమల: టీటీడీ ఇన్‌చార్జ్ సీవీఎస్‌ఓగా మంగళవారం ఎస్పీ హర్షవర్ధన్ రాజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయ న తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయనను టీటీడీ ఆలయ డిప్యూటీ ఈలో లోకనాథం లడ్డూ ప్రసాదాలతో సత్కరించి, వేద ఆశీర్వచనాలు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment