పోలీస్ గ్రీవెన్స్‌కు 92 అర్జీలు
తిరుపతి క్రైం: తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 92 ఫిర్యాదులు అందినట్టు ఎస్పీ హర్షవర్ధన్‌్ రాజు తెలిపారు. ఇందులో దొంగతనాలు, ఆస్తి తగాదాలు, ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నాయన్నారు. వెంటనే సంబంధిత అర్జీలు పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు.
మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం
ఇటీవల ఏఆర్పీసీ(3786) అనిల్‌కుమార్ అనారోగ్యంతో మృతిచెందారు. ఈ మేరకు ఎస్పీ చేతుల మీదుగా మృతుడి తల్లి సుశీలమ్మకు రూ.50 వేలను అందజేశారు.
మహిళలకు భరోసా శక్తి
మహిళలకు మేమున్నామని భరోసా కల్పించే విధంగా ఉండడమే శక్తి టీం ఉద్దేశమని ఎస్పీ పేర్కొన్నారు.
ఇంటర్ పరీక్షకు
125 మంది గైర్హాజరు
తిరుపతి ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా సోమవారం జిల్లా వ్యాప్తంగా 14 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ప్రథమ సంవత్సర విద్యార్థులకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్‌మెటిక్స్(బైపీసీ) సబ్జెక్టుల్లో పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు జనరల్ 41 మంది, ఒకేషనల్‌లో 1,070 మంది, జనరల్ బ్రిడ్జి కోర్సులో 47 మంది, మొత్తం 1,158మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉంది. అయితే వీరిలో 125 మంది గైర్హాజరైనట్టు ఆర్‌ఐఓ జీవీ.ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా మంగళవారం ద్వితీయ సంవత్సర విద్యార్థులకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్‌మెటిక్స్(బైపీసీ) సబ్జెక్టుల్లో పరీక్షను నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
శ్రీవారి దర్శనానికి 10 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 9 కంపార్ట్‌మెంట్లు నిండాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 82,721 మంది స్వామివారిని దర్శించుకోగా 27,261 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4.46 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో, దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 10 గంటల్లో, ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment