పింఛన్ కోసం తిరుగుతున్నా
వృద్ధాప్య పింఛన్ కోసం కొన్ని వారాలుగా తిరుగుతూనే ఉన్నా. నాకు న్యాయం చేయాలని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రయోజం లేదు. కలెక్టరేట్‌లోనైనా న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఇక్కడి వచ్చా.
– యు.రమణయ్య అచ్చారి, పెద్దపాలేడు,
బుచ్చినాయుడుకండ్రిగ మండలం
శ్మశాన వాటికకు దారిలేదు
మా కాలనీకి చెందిన శ్మశానికి వెళ్లడానికి దారి లేదు. నానా ఇక్కట్లు పడుతున్నాం. గ్రామ స్థాయి నుంచి మండల, డివిజన్ స్థాయి వరకు అధికారులుకు మొరపెట్టుకున్నాం. ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు కలెక్టరేట్‌లో అర్జీ ఇచ్చాం. –మునికృష్ణయ్య, పెనుమల్లం, ఏర్పేడు మండలం
నా భర్తకు పక్షవాతం వచ్చింది
నా భర్తకు పక్షవాతం వచ్చింది. మంచానికే పరిమితమయ్యాడు. పింఛన్ కోసం ఆరు నెలలుగా తిరుగుతున్నాం. కనీసం ఆయన మందులకు కూడా డబ్బుల్లేవు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. – భర్త కోటయ్యతో రమణమ్మ,
జాండ్రపేట, వాకాడు మండలం
నా భూములు ఆక్రమించారు
నా భూమిని ఆక్రమించారు. స్థానిక రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వారు పట్టించుకోవడం లేదు. విచారణ చేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. – కోదండరామయ్య,
పీఎస్ పాళెం, చిన్నగొట్టిగల్లు మండలం
పింఛన్ కోసం తిరుగుతున్నా
పింఛన్ కోసం తిరుగుతున్నా
పింఛన్ కోసం తిరుగుతున్నా
Comments
Please login to add a commentAdd a comment