పోలీసుల్లో ‘ఫైర్’ ఉండాలి
చంద్రగిరి: వార్షిక ఫైరింగ్ శిక్షణలో ప్రతి ఒక్కరూ ఉత్తమ నైపుణ్యాన్ని ప్రదర్శించాలని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆకాంక్షించారు. కల్యాణీ డ్యామ్‌లో నిర్వహిస్తున్న ఫైరింగ్ శిక్షణను సోమవారం ఆయన పరిశీలించారు. అత్యాధునిక ఆయుధాలతో ఫైరింగ్ ప్రాక్టీస్ చేసి ఆయన సిబ్బందిలో ఉత్సాహం నింపారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిరక్షణలో సాయుధ దళ పోలీసుల సేవలు చాలా కీలకమని, ఫైరింగ్ రేంజ్‌లో అధికారుల పర్యవేక్షణలో జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసి నైపుణ్యం పెంపొందించుకోవాలన్నారు. ఆ తర్వాత ఏఆర్ పోలీసు అధికారులు, సిబ్బందితో ఫైరింగ్ శిక్షణపై మాట్లాడారు. ప్రతి బుల్లెట్ టార్గెట్ (లక్ష్యం) వైపే బుల్ పడేలా శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని జిల్లా పోలీసు శాఖ ఉన్నతి కోసం ముందడుగు వేయాలన్నారు. తిరుపతి జిల్లా రాష్ట్రంలోనే అతి పెద్ద జిల్లా అని, ప్రపంచ ప్రసిద్ధి గాంచిన శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం ఉండడంతో వీవీఐపీలు, వీఐపీలు సరైన భద్రత, మరో వైపు ప్రజా రక్షణను దృష్టిలో ఉంచుకుని ఫైరింగ్ శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. సివిల్ పోలీసులు 1500మంది, ఆర్మ్‌డ్ సిబ్బంది 640మంది, సీఐలు 36, డీఎస్పీలు 11, ఎస్‌ఐలు 67మంది, అడిషనల్ ఎస్పీలు 4 ఫైరింగ్‌లో శిక్షణ పొందినట్టు వెల్లడించారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ అధికారి హేమంత్, అదనపు ఎస్పీలు రామకృష్ణ, నాగభూషణం, శ్రీనివాసరావు, డీఎస్పీలు, సీఐలు, ఆర్‌ఐలు పాల్గొన్నారు.
● ఫైరింగ్ శిక్షణలో ఎస్పీ దిశానిర్దేశం
పోలీసుల్లో ‘ఫైర్’ ఉండాలి
Comments
Please login to add a commentAdd a comment