‘1,1,1,2,2,2,3,3,3 ర్యాంకులు మావే..’ అంటూ ఎక్కడో
హైదరాబాద్, బెంగళూరు, చైన్నెలో విద్యార్థులు సాధించిన
ర్యాంకులను తిరుపతిలో తమ సంస్థ సాఽధించిన విజయాలుగా చెప్పుకుంటూ చాలా మంది ప్రచారం చేస్తున్నారు.
ఎలాంటి అనుమతులు లేకుండా అపార్ట్‌మెంట్లు,
కల్యాణ మండపాలు, ఇళ్లల్లో కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి
లక్షలకు లక్షలు వసూలు
చేస్తున్నారు. డిగ్రీలు పూర్తి
చేసిన వారితో బోధన ఇప్పిస్తూ
చీటింగ్‌కు పాల్పడుతున్నారు. వీటిపై
ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తిరుపతి
జిల్లా వ్యాప్తంగా ఏర్పాటైన చీటింగ్ సెంటర్ల
భాగోతంపై ‘సాక్షి’ స్పెషల్ ఫోకస్.
తిరుపతిలో 2వేల కోచింగ్ సెంటర్లు
తిరుపతి నగరంలో సుమారు 2వేల కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. నోటిఫికేషన్లు విడుదల గాకముందు నుంచే తమ కోచింగ్ సెంటర్‌లో ర్యాంకుల పంట పండిందంటూ తప్పుడు సమాచారంతో తల్లిదండ్రులను బుట్టలో వేసుకుంటున్నారు. నిపుణులైన అధ్యాపకులను నియమించకుండానే కాంపిటేటీవ్ పరీక్షలకు కోచింగ్ ఇప్పిస్తున్నారు. కల్యాణ మండపాలను, అపార్ట్‌మెంట్లు, నివాస గృహాలలో మైకులు పెట్టి పుస్తకం చేతబట్టి చదువు చెబుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారులు తనీఖీలు నిర్వహించాలి.
–ఆర్వీ చంద్రశేఖర్‌రెడ్డి,రిటైర్డ్ అధ్యాపకులు, తిరుపతి
సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్ ఉండరు
పోటీ పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం కావాలంటే సబ్జెక్ట్‌లో తలపండిన నిపుణులు ఉండాలి. ఆధునిక పోటీ ప్రపంచంలో ర్యాంకులు సాధించాలన్నా, ఉన్నత స్థాయి ఉద్యోగాలను సాధించాలన్నా బోధన పద్ధతులు, నిపుణులైన అధ్యాపక బృందం అవసరం. కానీ ప్రస్తుతం కోచింగ్ సెంటర్లలో ఆపరిస్థితి లేదు.
–సూర్యనారాయణ, గతంలో పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చిన అధ్యాపకులు, తిరుపతి
పర్యవేక్షణ లేదు
కోచింగ్ సెంటర్లపై ప్రభుత్వాధికారులు దాడులు చేయాలి. అనుమతులు లేని కోచింగ్ సెంటర్లను వెంటనే రద్దు చేసి అపరాధం వేయాలి. ఇప్పటకై అధికారులు స్పందించకుంటే పోరుబాట తప్పదు
–హేమాద్రి యాదవ్, స్టూడెంట్స్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు, తిరుపతి
తిరుపతి సిటీ: ఉద్యోగం సాధించాలనే విద్యార్థుల ఆరాటం.. అమాయక తల్లిదండ్రుల ఆశలనే పెట్టుబడిగా కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు చెలరేగిపోతున్నారు. రోజుకో పేరుతో ఒక్కో రోజు ఒక్కో చోట బోర్డులు పెట్టి కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. తిరుపతి నగరంలోని ఎమ్మార్‌పల్లి సర్కిల్, ఎయిర్ బైపాస్ రోడ్డు, బాలజీ కాలనీ, భవానీనగర్, వీవీమహల్ రోడ్డు, అన్నారావు సర్కిల్, లీలామహల్ సర్కిల్ వంటి ప్రధాన ప్రాంతాలతో పాటు నగరంలో జనసంచారం అధికంగా గల వీధుల్లో సైతం కోచింగ్ సెంటర్లు నెలకొల్పుతున్నారు.
అధికారుల నిర్లక్ష్యం... కోచింగ్ సెంటర్ల ఇష్టారాజ్యం
అధికారుల పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యం కారణంగా కోచింగ్ సెంటర్ల యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఫీజుల విషయంలో స్పష్టత లేకుండా.. నిపుణులైన అధ్యాపకులతో బోధన చేయకుండా లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. కోచింగ్ సెంటర్‌లో కనీస మౌలిక వసతులు ఏర్పాటు చేయకుండా విద్యార్థులను ముప్పుతిప్పలకు గురిచేస్తున్నారు. ఫైర్ సేఫ్టీ టూల్స్, ఫస్ట్ ఎయిడ్ వంటి సౌకర్యాల మాట దేవుడెరుగు, కనీసం మంచినీటి సౌకర్యమూ కల్పించకుండా గొంతెండబెడుతున్నారు.
జిల్లాలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న కోచింగ్ సెంటర్లు
ఎంసెట్, నీట్, డీఎస్సీ కోచింగ్ అంటూ నిలువు దోపిడీ
పేద విద్యార్థులే టార్గెట్‌గా ప్రచారం
ఆన్‌లైన్, ఆఫ్ లైన్ శిక్షణ పేరుతో
అడ్డగోలుగా వసూళ్లు
కానరాని మౌలిక సదుపాయాలు
చోద్యం చూస్తున్న అధికారులు
ఇంటర్ పరీక్షలు ముగిశాయి. ఎంసెట్, నీట్ వంటి ప్రవేశ పరీక్షల వైపు విద్యార్థుల తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. అవకాశాన్ని క్యాష్ చేసుకునేందుకు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు ఇంటింటా ప్రచారంతో పాటు సీటు గ్యారెంటీ ఆఫర్లతో రెచ్చిపోతున్నారు. షార్ట్ టర్మ్ కోచింగ్‌కు అయితే రూ.30వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు. లాంగ్‌టర్మ్ కోచింగ్‌కు రూ.2 లక్షల నుంచి రూ.3లక్షల వరకు ముక్కుపిండి గుంజేస్తున్నారు. డీఎస్సీ, బ్యాంక్, రైల్వే, గ్రూప్స్ వంటి పోటీ పరీక్షలకు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు నుంచి పేరొందిన అధ్యాపకుల చేత ఉత్తమ శిక్షణ ఇప్పిస్తామంటూ ప్రగల్భాలు పలుకుతూ విద్యార్థులకు కుచ్చుటోపీ పెడుతున్నారు.
దారుణం
పేద విద్యార్థులను టార్గెట్ చేస్తూ అసాధ్యమైన ఫలితాలు సాధిస్తామంటూ కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలు నమ్మబలికి తల్లిదండ్రుల కడుపు కొడుతూ అప్పుల పాలు చేస్తున్నాయి. అర్హత లేని అధ్యాపకులతో కోచింగ్ ఇవ్వడంతో పాటు ఒక్క కోచింగ్ సెంటర్లలోనూ మౌలిక సదుపాయాలు ఉండవు.
–శివశంకర్ నాయక్, జేఎన్‌ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, తిరుపతి
అనుమతులు లేనే లేవు
తిరుపతిలో వెలసిన వేల కోచింగ్ సెంటర్లకు అనుమతులు లేవు. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడపడితే అక్కడ బోర్డులు పెట్టేస్తున్నారు. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థుల చేతనే జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సైతం కోచింగ్ ఇప్పిస్తున్నారు.
–ప్రవీణ్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి, తిరుపతి
రూ.30 వేల నుంచి రూ.2 లక్షల వరకు వసూళ్లు
రూ.30 వేల నుంచి రూ.2 లక్షల వరకు వసూళ్లు
రూ.30 వేల నుంచి రూ.2 లక్షల వరకు వసూళ్లు
రూ.30 వేల నుంచి రూ.2 లక్షల వరకు వసూళ్లు
రూ.30 వేల నుంచి రూ.2 లక్షల వరకు వసూళ్లు
రూ.30 వేల నుంచి రూ.2 లక్షల వరకు వసూళ్లు