
రెండు బైక్‌లు ఢీ ●
● ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు
ఓజిలి: రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి గాయాలైన ఘటన ఓజిలి రాచపాళెం క్రాస్‌రోడ్డు వద్ద ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. గూడూరు పట్టణానికి చెందిన గూడూరు మస్తాన్(44) రాచపాళెం జాతీయ రహదారి పక్కనే ఉన్న తారుఫ్లాంట్‌లో వాచ్‌మన్, ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం విధులకు హాజరై రాత్రి రాజుపాళెం గ్రామంలోని దుకాణాల వద్దకు వెళ్లి తిరిగి తారుఫ్లాంట్‌కు రాంగ్‌రూట్‌లో వస్తున్నాడు. అదే సమయంలో లింగసముద్రం గ్రామానికి చెందిన ప్రవీణ్, సుధీర్ ఇంకో బైక్‌పై శ్రీకాళహస్తికి వెళ్లి పనులు ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో రాచపాళెం క్రాస్‌రోడ్డు సమీపంలోకి వచ్చే సరికి రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గూడూరు మస్తాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రవీణ, సుధీర్‌కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను నాయుడుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.