
దాడి చేసిన వారిపై కేసు
సైదాపురం: మండల కేంద్రంలోని ఎస్టీ కాలనీకి చెందిన నక్కా వరాలుపై అదే కాలనీకి చెందిన నక్కా శ్రీనయ్యతో పాటు మరో వ్యక్తి ఆదివారం దాడిచేసి గాయపరిచారు. గతంలో విరిమధ్య పాతకక్ష్యలు ఉండడంతో వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో నక్కా వరాలుపై కర్రలతో దాడిచేసి గాయపరిచారు. ఈ మేరకు దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ క్రాంతికుమార్ తెలిపారు.
ఫీల్డ్ అసిస్టెంట్‌పై దాడి
పెళ్లకూరు: మండలంలోని పునబాక గ్రామానికి చెందిన ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్ చంద్రపై ఆ శాఖ ఏపీఓ దయానంద్ దాడికి పాల్పడడంతో రక్త గాయాలయ్యాయి. బాధితుని కథనం.. పునబాక గ్రామంలో ఉపాధిహామీ పనులకు సంబంధించిన మస్టర్లు నమోదు విషయంలో మంగళవారం స్థానిక కార్యాలయంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఏపీవో క్యారీయర్ బాక్సుతో ఫీల్డ్ అసిస్టెంట్ చంద్రపై దాడిచేశాడు. ఈ దాడిలో చంద్ర తలకు రక్తగాయమైంది. స్థానికులు పెళ్లకూరు పీహెచ్‌సీలో ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం నాయుడుపేటకు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
భూసేకరణ వేగవంతం
తిరుపతి అర్బన్: జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు భూసేకరణతోపాటు నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి ఆయన వర్చువల్ పద్ధతిలో జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. రేణిగుంట, పూడి, గూడూరు, పాకాల, తిరుపతి టౌన్‌కు సంబంధించిన రైల్వే ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలన్నారు. నడికుడి– శ్రీకాళహస్తి రైల్వే ప్రాజెక్టు పనులకు సంబంధించి భూసేకరణ పనులు పూర్తయ్యాయని, ఆరు లేన్ల రహదారి నిర్మాణం, తిరుపతి బైపాస్ వేగవంతం చేయాలని చెప్పారు. రేణిగుంట నుంచి చైన్నె వరకు నాలుగు లేన్ల రహదారి పనులు పూర్తి చేయాలని చెప్పారు. గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్రమీనా, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి ఆర్డీవోలు కిరణ్మయి, భానుప్రకాష్‌రెడ్డి, హైవే పీడీలు వెంకటేష్, ఎంకే చౌదరి, డిప్యూటీ తహసీలార్దుర్ భాస్కర్ పాల్గొన్నారు.
27 నుంచి బ్యాక్‌లాగ్
ప్రవేశాలకు పరీక్ష
తిరుపతి సిటీ: ఆంధ్రప్రదేశ్ మహాత్మా జ్యోతీబాపూలే గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలోని బ్యాక్ లాగ్ వేకెన్సీలకు సంబంధించి ప్రవేశ పరీక్ష ఈనెల 27, 28 తేదీలలో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఉంటుందని ప్రిన్సిపల్ కే.రేష్మా తెలిపారు. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు మంగళవారం విడుదల చేసినట్లు పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ mjpapbcwreir .apcfrr.in ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌న్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు.

దాడి చేసిన వారిపై కేసు

దాడి చేసిన వారిపై కేసు