
టూరిస్టులపై ఉగ్రదాడి అమానుషం
● ఉగ్రవాదులను సమూలంగా ఏరివేయాలి ● దాడిని ఖండిస్తున్నాం ● వైఎస్సార్‌సీపీ కొవ్వొత్తుల ర్యాలీ ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి
తిరుపతి మంగళం : జమ్ము కశ్మీర్‌లోని పెహల్గాం వద్ద పర్యాటకులపై ఉగ్రవాదులు దాడులు చేయడం అమానుషమని వైఎస్సార్‌సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి అన్నారు. జమ్ముకశ్మీర్ ఉగ్రదాడిని ఖండిస్తూ వైఎస్సార్‌సీపీ అధినేత, మా జీ సీఎం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు బుధ వారం రాత్రి తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ కా ర్యాలయం నుంచి తిరుచానూరు బైపాస్‌రోడ్డు వరకు భూమన కరుణాకరరెడ్డి, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వకర్త భూమన అభినయ్‌రెడ్డి, పార్టీ శ్రేణులు కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ అమా యకులైన పర్యాటకులపై పాకిస్థాన్ ఉగ్రవాదులు చేసి న కిరాతక దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దేశ సమైక్యతను దెబ్బతీసేలా జరిగిన ఉగ్రవాద చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించకూడదన్నారు. హనీ మూన్ కోసం వెళ్లిన నూతన దంపతుల్లో అబ్బాయిని కాల్చిచంపడం దుర్మార్గపు చర్య అన్నారు. రాజకీయా లకతీతంగా ఉగ్రదాడులను ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కేంద్ర ప్రభు త్వం ఉగ్రవాదులను సమూలంగా ఏరిపారేయాలన్నారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సుమారు 30 మంది టూరిస్టులకు తగిన న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తెసుకోవాలని కోరారు. మృతు ల ఆత్మకు శాంతి కలగాలని, క్షతగాత్రులు త్వరగా కో లుకోవాలని ఆయన వేడుకున్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే బియ్యపు మదుసూధన్‌రెడ్డి మాట్లాడుతూ కశ్మీర్‌లో ఇప్పుడిప్పుడే ప్రశాంత వాతావరణం నెలకొందన్నారు. ఈ తరుణంలో పాకిస్థాన్ ఉగ్రవాదులు ఇలాంటి దాడులకు తెగబడడం బాధాకరమన్నారు. వైఎస్సార్‌సీపీ ముస్లిం మైనార్టీ జోనల్ ఇన్‌చార్జ్ షయ్యద్ షఫీ అహ్మద్ ఖాదరీ మాట్లాడుతూ ముష్కరులకు కుల మతాలు, దయాదాక్షిణ్యాలు ఉండవన్నారు. శాంతికి చిహ్నమైన భారతదేశంలోకి ఉగ్రవాదులు చొరబడి మారణకాండ సృష్టించడం బాధాకరమన్నారు. పాకిస్థాన్ కుక్కలను భారదేశంలోకి చొరబడకుండా ఉగ్రవాదాన్ని సమూలంగా ఏరిపారేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కార్పొరేటర్లు, పార్టీ అనుబంధ సంస్థల చైర్మన్లు, డైరెక్టర్లు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
పిరికి పందల చర్య
– చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి
తిరుపతి రూరల్: కశ్మీర్ సమీపంలోని అనంతనాగ్ జిల్లా పహల్గాంలో మంగళవారం పర్యాటకులపై ఉగ్ర వాదుల దాడి పిరికిపందల చర్య అని వైఎస్సార్ సీపీ చంద్రగిరి నియోజక వర్గ ఇన్‌చార్జ్ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి అన్నారు. బుధవారం తిరుపతి రూరల్ మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీపీ మూలం చంద్రమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దుశ్చర్యలను ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి మాట్లాడుతూ సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు మతం అడిగి మరీ మారణకాండకు దిగడం, భార్య కళ్ల ముందే భర్తను కాల్చి చంపడం హేయమైన చర్య అన్నారు. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్థిస్తున్నానన్నారు. ఈ కార్య క్రమంలో వైస్ ఎంపీపీ విడుదల మాధవరెడ్డి, నేతలు హరికృష్ణారెడ్డి, జయకర్, వెంకటరమణ, కోటి, మన్నూరు శివ, రవి, రాజ, భారతి, అరుణ్, ప్రకాష్, హేమాద్రి, విజయలక్ష్మి, శశి, కుప్పిరెడ్డిగారి ప్రతాప్‌రెడ్డి, గురు స్వామిరెడ్డి పాల్గొన్నారు.

టూరిస్టులపై ఉగ్రదాడి అమానుషం

టూరిస్టులపై ఉగ్రదాడి అమానుషం