
సివిల్స్‌లో ‘సాయితేజ’ం
పరిశోధనలకు అవకాశం
అరుదైన మూలకాలపై అద్వితీయ పరిశోధన లకు అవకాశం ఉందని కొచ్చిన వర్సిటీ వీసీ జునాయిడ్ బుషిరీ అన్నారు.
గురువారం శ్రీ 24 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– 4లో
పది పరీక్షల ఫలితాల్లో ఈ సారీ అమ్మాయిలే పదింతలు మెరిశారు. తమ సత్తా చాటారు. ఉత్తమ ఫలితాల సాధించి తమ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మన్నలు పొందారు. కాగా ఈ ఏడాది జిల్లా తొమ్మిది మొట్టు దిగజారి, 19వ స్థానంలో నిలిచింది. కాగా గత ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన సంస్కరణల ఫలితాలు నేడు ప్రతిబింబించాయి. ఈ ఏడాది సర్కారు స్కూలు విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు.
విద్యార్థులతో కలెక్టర్ వెంకటేశ్వర్, డీఈఓ కేవీఎన్ కుమార్
పాఠశాల యథావిఽధిగా కొనసాగించాలి
– స్కూలు ఎదుట తల్లిదండ్రుల ఆందోళన
వెంకటగిరి రూరల్: మండలంలోని బుసపాళెంలో ప్రాథమిక పాఠశాలను యథావిధిగా ఐదో తరగతి వరకు కొనసాగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. వారు మాట్లాడుతూ బుసపాళెం ప్రాథమిక పాఠశాలలో ప్రస్తుతం ఒకటి నుంచి ఐదు వరకు తరగతులు కొనసాగుతున్నాయన్నారు. అయితే కూటమి ప్రభుత్వం విద్యావ్యవస్థలో తాజాగా తీసుకొచ్చిన మార్పులతో 2025–26 విద్యాసంవత్సరం నుంచి ఒకటి, రెండు తరగతుల వరకే పరమితి చేయడం సరికాదన్నారు. పాఠశాలలో సుమారు 34 మంది విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. ఐదో తరగతి వరకు ఉన్న పాఠశాలను రెండో తరగతికే పరమితి చేయడంతో 3,4,5 తరగతి చదువుతున్న విద్యార్థులు వల్లివేడుకు వెళ్లాలని ఉపాధ్యాయులు సూచించినట్లు తెలిపారు. బుసపాళెం నుంచి వల్లివేడు గ్రామానికి సుమారు నాలుగు కిలో మీటర్లు వెళ్లాల్సిరావడంతో తమ బిడ్డలు ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆరోపించారు. అంతేగాకుండా ఆటోలో రవాణా చేయించి చదివించాలంటే తలకు మించిన భారంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా జిల్లా ఉన్నత అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి పాఠశాలను యథావిధిగా కొనసాగాలే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
నారాయణవనం నుంచి తొలి ఐఏఎస్
నారాయణవనం: యూపీఎస్సీ పరీక్షల్లో 988 ర్యాంకును సాధించి మండలం నుంచి తొలి ఐఏఎస్‌గా గోవిందప్పనాయుడు కండ్రిగ కు చెందిన పామూరి సురేష్ గురింపు తెచ్చుకున్నారు. జెన్‌కో ఏఈగా పనిచేస్తూ ఐఏఎస్ కావాలన్న కలను సురేష్ ఏడో ప్రయత్నంలో సాకారం చేసుకున్నాడు. గోవిందప్పనాయుడు కండ్రిగకు చెందిన సాధారణ రైతు మురగయ్య, మునిలక్ష్మి దంపతుల కుమారుడు సురేష్ పాఠశాల విద్యను అరణ్యంకండ్రిగ ఉన్నతపాఠశాలలో పూర్తి చేశాడు. నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నుంచి మెకానికల్ డిప్లమో పొందారు. కర్నూలు పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేసి, 2012లో జెన్‌కోలో ఏఈగా చేరారు. ఐఏఎస్ కావాలన్న లక్ష్యంతో 2017 నుంచి సివిల్స్ రాయడం ప్రారంభించాడు. మూడు ప్రయత్నాలు విఫలం కావడంతో 2020లో ఉద్యోగానికి రాజీనామా చేసి ఢిల్లీలో కోచింగ్ తీసుకున్నారు. ఏడో ప్రయత్నంలో తన కలకు సాకారం చేస్తూ ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. సురేష్ ఐఏఎస్‌కు ఎంపిక కావడంతో గ్రామంలో బంధువులు, సన్నిహితులు ఆనందం వ్యక్తం చేశారు.
పది ఫలితాల్లో
మెరిసిన బాలికలు
● 79.83 శాతం ఉత్తీర్ణతతో
జిల్లాకు 19వ స్థానం
● 26,679 మంది విద్యార్థుల్లో
21,298 మంది ఉత్తీర్ణత
● బాలురు 76.83 శాతం, బాలికలు 83.18 శాతం ఉత్తీర్ణత
● మే 19 నుంచి 28వ తేదీ వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష
పది ఆణిముత్యాలకు ట్యాబ్‌లు
తిరుపతి అర్బన్: పదో తరగతిలో ఉత్తమ మార్కు లు సాధించిన ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థాయి లో నిలిచిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కలెక్టర్ వెంకటేశ్వర్ చేతుల మీదుగా ట్యాబ్‌లు అందజేశారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో డీఈఓ కేవీఎన్ కుమార్ నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని చే పట్టారు. డక్కిలి మండలంలోని చాపలపల్లి మున్సిపల్ హైస్కూల్ విద్యార్థి కే. ఇంద్రజ 600కు 594 మార్కులు సాధించి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచింది. అలాగే ఎర్రావారిపాళెం మండలంలోని కోటకాడపల్లి జెడ్పీ హైస్కూల్ విద్యార్థి ని ఎం.సేవిత 591 మార్కులతో ద్వితీయ స్థానం, నాయుడుపేట మండలం మేనకూరు జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని ఏ.వందన 589 మార్కులు, అగ్రహారం పల్లి మున్సిపల్ హైస్కూల్ విద్యార్థి ఏ. కేతన్ 589 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచారు. వీరికి ట్యాబ్‌లు పంపిణీ చేశారు.
తిరుపతి ఎడ్యుకేషన్ : పదో తరగతి పబ్లిక్ పరీక్షా ఫ లితాల్లో ఎప్పటిలానే ఈ ఏడాది 83.18 శాతం ఉత్తీర్ణతతో బాలికలు పైచేయి సాధించారు. గత ఏడాది ఫలితాల్లో 90.71 శాతం ఉత్తీర్ణతతో జిల్లా పదో స్థా నంలో నిలవగా ఈ ఏడాది 79.83 శాతం ఉత్తీర్ణత తో 19వ స్థానానికి దిగజారింది. తిరుపతి జిల్లాలోని 34 మండలాల పరిధిలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలను మార్చి 17 నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు 164 పరీక్ష కేంద్రాల్లో పకడ్భందీగా నిర్వహించారు. ఈ పరీక్షలకు బాలురు 14,063 మంది, బాలికలు 12,616 మంది, మొత్తం 26,679 మంది విద్యార్థు లు హాజరయ్యారు. బాలురు 10,804 (76.83 శా తం) మంది, బాలికలు 10,494(83.18 శాతం) మంది, మొత్తం 21,298 (79.83శాతం) మంది వి ద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంగ్లిష్ మీడియంలో 24,861 మంది హాజరుకాగా వారిలో 20,176 (81.16శాతం)మంది, తెలుగు మీడియంలో 1,728 మందిలో 1,043 (63.36శాతం) మంది, తమిళం మీడియంలో 72 మందిలో 61 (84.72 శాతం) మంది, ఉర్దూ మీడియంలో 18 మందికి 18 (100 శాతం)మంది ఉత్తీర్ణత సాధించారు.
మే 19నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు
పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 19 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్నారు. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు, రీ–కౌంటింగ్, రీ–వెరిఫికేషన్‌కు సంబంధించి ఈ నెల 24 నుంచి 30వ తేదీలోపు ఆలస్య రుసుము లేకుండా, అలాగే మే 1నుంచి 18వ తేదీలోపు ఆలస్యరుసుముతో కలిపి దరఖాస్తు చేసుకోవచ్చని డీఈఓ తెలిపారు. రీ–కౌంటింగ్‌కు రూ.500, రీ–వెరిఫికేషన్‌కు రూ.వె య్యి ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. పరీక్ష దరఖాస్తు, ఫీజులు చెల్లించే సమయంలోనే మైగ్రేషన్ సర్టిఫికెట్‌కు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. డిజిటల్ సంతకం చేసిన మైగ్రేషన్ సర్టిఫికెట్‌ను ఫలితాలు ప్రకటించిన నాలుగు రోజుల తరువాత విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని డీఈఓ తెలిపారు.
ఉత్తమ మార్కులతో విజయఢంకా..
ఈ ఏడాది పది ఫలితాల్లో జిల్లా విద్యార్థులు అత్యధిక మంది ఉత్తమ మార్కులు సాధించి, విజయఢంకా మోగించారు. అన్ని యాజమాన్య పాఠశాలల నుంచి 26,679 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 21,298 మంది ఉత్తీర్ణత సాధించగా 5,381 మంది విద్యార్థులు ఫెయిల య్యారు. పాసైన వారిలో ఫస్ట్‌క్లాస్‌లో 17,630 మంది, సెకండ్ క్లాస్‌లో 2,546 మంది, థర్డ్ క్లాస్‌లో 1,122 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు డీఈఓ కేవీఎన్.కుమార్ తెలిపారు.
అత్యధిక మార్కులు సాధించిన
ప్రభుత్వ విద్యార్థులు వీరే..
1. కలాపతి ఇంద్రజ, 594 మార్కులు, ఏపీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, వెంకటగిరి
2. మూడే షెవిత, 591మార్కులు, జెడ్పీ హైస్కూల్, కోటకాడపల్లె, ఎర్రావారిపాళెం మండలం
3. అనంతపురం కేతన్, 589 మార్కులు, ఎంపీఎల్ హైస్కూల్, బాబు అగ్రహారం, శ్రీకాళహస్తి మండలం
4.ఆదేరు వందన, 589 మార్కులు, జెడ్పీ హై స్కూల్, మేనకూర్, నాయుడుపేట మండలం
అనంతపురం కేతన్‌ను అభినందిస్తున్న డీఈఓ కేవీఎన్.కుమార్ తదితరులు
ప్రభుత్వ పాఠశాలల
విద్యార్థుల ప్రభంజనం..
గత ప్రభుత్వం విద్యావ్యవస్థలో తీసుకువచ్చిన సంస్కరణలు నేడు ఫలితాల రూపంలో ప్రతిబింభించాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు అత్యధిక శాతం మంది ఉత్తీర్ణత సాధించడమే కాకుండా పలువురు విద్యార్థులు రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించి కార్పొరేట్‌కు ఏమాత్రం తీసిపోమని మరోసారి రుజువు చేశారు.
చిల్లకూరు: లక్ష్యసాధనకు పట్టుదలతో కృషి చేసి ఐపీఎస్‌ను వదలి ఐఏఎస్ ఎంపిక అయ్యాడు నాయుడుపేటకు చెందిన సాయితేజ. నాయుడుపేట మండలం చిలమత్తూరు గ్రామానికి చెందిన నెల్లూరు శ్రీనివాసులు చిల్లకూరు మండలం గమ్మళ్లదిబ్బలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఆయన భార్య సరస్వతి ఓజిలి ఆరోగ్య కేంద్రంలో హెల్త్ సూపర్‌వైజర్‌గా పని చేస్తుంది. వారి కుమారుడు నెల్లూరు సాయితేజ చిల్లకూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో పది వరకు చదివి, మంచి మార్కులతో పాస్ అయ్యాడు. అటు తరువాత ఇంటర్ విజయవాడలో చదివి ఐఐటీలో ఇంజినీరింగ్ చేసి హైదరాబాద్‌లో బీహెచ్‌ఈఎల్‌లో ఉద్యోగంలో చేరాడు. అయితే తను అనుకున్న లక్ష్యం ఇది కాదు అని సొంతంగా సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యాడు. దీంతో 2023–24 లో జరిగిన సివిల్స్‌లో 558వ ర్యాంకు సాధించి ఐపీఎస్‌కు ఎంపికై హైదరాబాద్‌లోనే పోలీస్ అకాడమిలో శిక్షణ తీసుకుంటున్నాడు. అయినా అనుకున్న లక్ష్యం సాధించేందుకు ఐపీఎస్‌గా శిక్షణ పొందుతూనే 2024–2025లో మరోసారి సివిల్స్ పరీక్షలకు పట్టుదలతో సాధన చేశాడు. ఈ సారి సివిల్స్‌లో 154వ ర్యాంకు సాధించాడు. దీంతో ఐఏఎస్‌కు మార్గం సుగమమం కావడంతో చిన్నతనంలో అనుకున్న లక్ష్యం సాధించాడు. తల్లిదండ్రులు ఇచ్చి ప్రోత్సాహంతోపాటుగా తన భార్య ఇచ్చిన సహకారంతోనే అనుకున్న లక్ష్యం సాధివంచగలిగానని సాయి తేజ అంటున్నారు.
జర్నలిస్టులపై
దాడులు హేయం
న్యూస్‌రీల్

సివిల్స్‌లో ‘సాయితేజ’ం

సివిల్స్‌లో ‘సాయితేజ’ం

సివిల్స్‌లో ‘సాయితేజ’ం

సివిల్స్‌లో ‘సాయితేజ’ం

సివిల్స్‌లో ‘సాయితేజ’ం

సివిల్స్‌లో ‘సాయితేజ’ం

సివిల్స్‌లో ‘సాయితేజ’ం

సివిల్స్‌లో ‘సాయితేజ’ం

సివిల్స్‌లో ‘సాయితేజ’ం