
● కందాడులో ప్రభుత్వ భూమి కబ్జా ● ఇవే భూములు గతంలో ఆక్రమ
సాక్షి ప్రతినిధి, తిరుపతి: శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కూటమి నేతలు బరితెగిస్తున్నారు. ఎక్కడ ఖాళీ జాగా కనిపిస్తే అక్కడ గద్దల్లా వాలిపోతున్నారు. ఆక్రమించుకుని, అనుభవించేందుకు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. మాట విననివారిపై చిందులు తొక్కుతున్నారు. ఎదురుతిరిగిన వారిపై కక్ష్యగట్టి వేధింపులకు పాల్పడుతున్నారు. అలాంటిదే శ్రీకాళహస్తి నియోజకవర్గం, ఏర్పేడు మండల పరిధిలో చోటు చేసుకుంది. అసలు ఆ కబ్జా కథ ఏంటో మీరే చదవండి!
అడ్డుకున్నా బరితెగింపేనా?
2019 ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు సదరు టీడీపీ నేత కందాడులోని ప్రభుత్వ భూమిని హడావుడిగా ఆక్రమించుకున్నాడు. ఆ భూముల్లో కూలీలను పెట్టి మామిడి మొక్కలు నాటించాడు. నాడు స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చినా ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో పెద్దగా పట్టించుకోలేదు. ఎన్నికలు ముగిశాక వెంటనే ఆ భూముల్లో నాటిన మామిడి చెట్లను తొలగించి స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత ఆ భూములను ఎవ్వరూ ఆక్రమించుకునేందుకు సాహసం చేయలేదు. తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండవ రోజే సదరు టీడీపీ నేత మరోసారి చెలరేగిపోయాడు. యథేచ్ఛగా ఆక్రమించుకుని స్వాధీనం చేసుకునేందుకు పెద్ద స్కెచ్చేయడం గమనార్హం.
కక్ష్యగట్టి బదిలీ
ఆక్రమితమ భూములను స్వాధీనం చేసుకున్న అధికారులపై సదరు టీడీపీ నేత కక్ష్యగట్టాడు. భూములను స్వాధీనం చేసుకున్నప్పుడు ఎవరెవరు పాల్గొన్నారో వారందర్నీ వేధించడం మొదలు పెట్టాడు. నాడు ఆక్రమిత భూముల్లోకి వచ్చి స్వాధీనం చేసుకున్న అధికారులను ఐదు నెలల క్రితం తన పలుకబడిని ఉపయోగించి బదిలీ చేయించినట్లు తెలిసింది. ప్రాధాన్యత లేని పోస్టుల్లోకి బదిలీచేసి వారిని తీవ్రంగా హింసిస్తున్నట్లు కలెక్టరేట్‌లో పనిచేసే ఓ అధికారి చెప్పడం ఆందోళన కలిగిస్తోంది.
దర్జాగా ఫెన్సింగ్