హుస్సేన్ సాగర్ నీళ్లలో పడి సెక్యూరిటీ గార్డు మృతి
రాంగోపాల్‌పేట్: లుంబినీ పార్కులో బోటును శుభ్రం చేస్తూ ఓ సెక్యూరిటీ గార్డు ప్రమాదవశాత్తు నీళ్లలో పడి మరణించాడు. ఈ ఘటన లేక్ సెక్రటరియేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం న్యూ నల్లకుంట గాంధీనగర్‌కు చెందిన సురారం యాదగిరి (56) గత ఐదేళ్ల నుంచి లుంబినీ పార్కులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. శనివారం సాయంత్రం బోటును శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు హుస్సేన్‌సాగర్ నీళ్లలో పడిపోయాడు. అటు తర్వాత పార్కు సిబ్బంది సీసీ కెమెరాలను పరిశీలించగా నీళ్లలో పడిపోయినట్లు గుర్తించారు. ఆదివారం సాయంత్రం హుస్సేన్ సాగర్ జలాల్లో మృతదేహం తేలియాడుతుండగా లేక్ పోలీసులు వెలికితీశారు. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసికున్న పోలీసులు ధర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment