కాజేసే కుట్ర!
పేదల ఇళ్లు..
మంచాల: పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వాలనే సదుద్దేశంతో 1985లో మండల పరిధిలోని లోయపల్లిలో ప్రభుత్వం 34, 35 సర్వే నంబర్లలో భూమి కొనుగోలు చేసింది. గ్రామానికి చెందిన నర్సింగ్‌రావుకు సంబంధించి 5.19 ఎకరాలను కొని, ఒక్కోగుంట(121 గజాలు) చొప్పున 150 మంది నిరుపేదలకు పంపిణీ చేసింది. కొందరికి అప్పట్లోనే సర్కారు ఇళ్లు మంజూరు చేసి నిర్మాణం సైతం చేయించింది. ప్రస్తుతం ఆ స్థలాల్లో అందరూ ఇళ్లు నిర్మించుకున్నారు. లబ్ధిదారులు అన్ని రకాల రుసుము చెల్లించి గ్రామ పంచాయతీ నుంచి ఇంటి నిర్మాణ అనుమతితో పాటు నల్లా కనెక్షన్లు సైతం తీసుకున్నారు. కరెంట్ సరఫరా సైతం వచ్చింది. రోడ్లతో పాటు అండర్ డ్రైనేజీ వ్యవస్థ కూడా ఏర్పాటు చేశారు. ఏటా ప్రభుత్వానికి పన్నులు కూడా చెల్లిస్తున్నారు. అక్కడ పూర్తిగా జనాలతో ఇళ్లు నిండిపోయాయి. కానీ సదరు భూమిపై తమకు హక్కులున్నాయని అప్పటి భూ యజమాని వారసులు లబ్ధిదారులను వేధిస్తున్నారు.
బ్రోకర్లతో బెదిరింపులు
2020లో ధరణి పోర్టల్‌లో సదరు భూమికి సంబంధించి అప్పటి పట్టాదారు నర్సింగ్‌రావు పేరు తిరిగి రికార్డులోకి వచ్చింది. అక్కడ గ్రామస్తులు ఇళ్లు నిర్మించుకున్నా తిరిగి పాత పట్టాదారు పేరునే అధికారులు నమోదు చేశారు. ప్రస్తుతం సదరు భూమిని నర్సింగ్‌రావు కుమారుడైన ఆనందరావు కొంత మంది బ్రోకర్ల పేరు మీద 3 నుంచి 5 గుంటల చొప్పున కొనుగోలు చేసినట్లు అక్రమ పట్టా పాసు పుస్తకాలు సృష్టించారు. ఆ పత్రాలు బాంకుల్లో తనఖా పెట్టి రుణాలు సైతం తీసుకున్నారు. అంతటితో ఆగకుండా అనాడు ప్రభుత్వం ఇచ్చిన లబ్ధిదారులను భయపెడుతున్నారు. ‘మీ ఇళ్ల స్థలాలు మా పేర్ల మీద ఉన్నాయి. నయానో, భయానో ఇవ్వండి.’ లేకుంటే భవిష్యత్‌లో ఇబ్బందులు పడతారని బెదిరిస్తున్నారు. దీంతో లబ్ధిదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.
ప్రభుత్వ వ్యవస్థాగత నిర్ణయంలో లోపం... దాన్ని సరి చేయాల్సిన అధికారుల అలసత్వంకారణంగా 150 మంది పేదలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. నలభై ఏళ్ల క్రితం సర్కారు ఇచ్చిన ఇళ్ల స్థలాలను ధరణి పోర్టల్ పేరుతో ఆక్రమించే ఉదంతం మంచాల మండలం లోయపల్లిలో వెలుగు చూసింది.
నలభై ఏళ్ల క్రితం పేదలకుఇచ్చిన భూములు
అధికారుల అండతో పాత పట్టాదారుకు బదలాయింపు
తీవ్ర ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారులు
కాజేసే కుట్ర!
కాజేసే కుట్ర!
Comments
Please login to add a commentAdd a comment