మహాసభను విజయవంతం చేయండి
టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడుశ్రీకాంత్‌రెడ్డి, కార్యదర్శి ప్రవీణ్‌కుమార్
సాక్షి, రంగారెడ్డిజిల్లా: టీ యూడబ్ల్యూజే రంగారెడ్డి జిల్లా రెండో మహాసభను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు కొంపల్లి శ్రీకాంత్‌రెడ్డి, కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ పిలుపునిచ్చారు. ఈ నెల 11(మంగళవారం)న శంకర్ పల్లి మండల పరిధిలోని పొద్దటూరు శివారులోని ప్రగతి రిసార్ట్స్‌లో నిర్వహిస్తున్న జిల్లా రెండో మహాసభకు మీడియా అకాడమీ చైర్మన్, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు కె.శ్రీనివాస్ రెడ్డి, మాజీ చైర్మన్ దేవులపల్లి అమర్, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కార్యదర్శి నరేందర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు మాజీద్, సత్యనారాయణ, నగునూరి శేఖర్, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు విరాహత్ అలీ, కార్యదర్శి రాం నారాయణలతో పాటు పలువురు జాతీయ, రాష్ట్ర నాయకులు హాజరవుతున్నారని వారు తెలిపారు. జిల్లాలోని జర్నలిస్టులు అందరూ మహాసభకు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఇటీవల నిర్వహించిన సభ్యత్వ నమోదుకు విశేష స్పందన వచ్చిందని పేర్కొన్నారు. జిల్లాలో 25 సంవత్సరాలకు పైగా విశేష సేవలందిస్తున్న సీనియర్ జర్నలిస్టులకు ఈ మహాసభల సందర్భంగా సన్మానిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి జర్నలిస్టులు హాజరు కావాలని కోరారు.
బైక్, ఆటో ఢీకొని వ్యక్తి మృతి
కుల్కచర్ల: ఎదురెదురుగా వస్తున్న బైక్, ట్రాలీ ఆటో ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కుల్కచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... కొత్తపల్లి తండాకు చెందిన రమేశ్(30) కూలీ పనులు చేసేవాడు. శనివారం రాత్రి ఆయన వ్యక్తిగత పనుల నిమిత్తం బైక్‌పై చౌడాపూర్ నుంచి స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో కిష్టంపల్లి నుంచి వస్తున్న ట్రాలీ ఆటో మక్తవెంకటాపూర్ గేటు గ్రామశివారులో ఎదురెదురుగా వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రమేశ్‌ను 108లో మహబూబ్‌నగర్ ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ అన్వేష్‌రెడ్డి తెలిపారు.
సెల్‌ఫోన్ల అప్పగింత
యాలాల: సెల్‌ఫోన్ పోగొట్టుకున్న బాధితులకు పోలీసులు సీఈఐఆర్ పోర్టల్ సహకారంతో తిరిగి అప్పగించారు. ఇటీవల బండవెల్కిచర్ల గ్రామానికి చెందిన గాజుల రాములు మాతాశిశు ఆస్పత్రి వద్ద, యాలాల మంలడల పరిధి పగిడిపల్లికి చెందిన లొంకాల గోవింద్ జుంటుపల్లిలో మొబైల్ పోగొట్టుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఫోన్‌లను గుర్తించారు. ఈ మేరకు ఎస్‌ఐ గిరి ఆదివారం బాధితులకు అందజేశారు.
ఆరు ట్రాక్టర్లు సీజ్
యాలాల: అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. ఎస్‌ఐ గిరి తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని యాలాల, సంగెంకుర్దు, కోకట్ గ్రామాల పరిధిలో ఇసుక తరలిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు పోలీసులు దాడులు చేపట్టి ఆరు ట్రాక్టర్లను యాలాల ఠాణాకు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
కార్ల ఢీ.. నలుగురికి గాయాలు
పరిగి: ఎదురెదురుగా రెండు కార్లు ఢీకొని నలుగురికి గాయాలైన సంఘటన మండల పరిధిలోని తుంకల్‌గడ్డ సమీపంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మిట్టకోడూర్ గ్రామానికి చెందిన కొందరు కారులో పరిగి నుంచి స్వగ్రామానికి వవెళ్తున్నారు. ఈ క్రమంలో చిగురాల్‌పల్లి నుంచి పరిగికి కొందరు కారులో వస్తుండగా తుంకల్‌గడ్డ సమీపంలో ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో రెండు కార్లల్లో ఉన్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం పరిగి ఆస్పత్రికి తరలించి, ప్రథమ చికిత్స అనంతరం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
మహాసభను విజయవంతం చేయండి
మహాసభను విజయవంతం చేయండి
మహాసభను విజయవంతం చేయండి
Comments
Please login to add a commentAdd a comment