ఉపాధి కూలీల బిల్లులు చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

ఉపాధి కూలీల బిల్లులు చెల్లించాలి

Published Fri, Mar 14 2025 7:39 AM | Last Updated on Fri, Mar 14 2025 7:39 AM

ఉపాధి

ఉపాధి కూలీల బిల్లులు చెల్లించాలి

సీపీఎం జిల్లా కార్యదర్శి మైపాల్‌

మర్పల్లి: పెండింగ్‌లో ఉన్న ఉపాధి కూలీ డబ్బులు వెంటనే వారి ఖాతాల్లో జమచేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్‌.మైపాల్‌ డిమాండ్‌ చేశారు. గురువారం ఆయన మండల కేంద్రంలో పార్టీ నాయకులు, ఉపాధి కూలీలతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. కూలీ డబ్బుల చెల్లింపులో ప్రభుత్వం జాప్యం చేయడం సరికాదన్నారు. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న పేద రైతులను గుర్తించి వారికి వెంటనే పట్టాలు అందజేయాలన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు సతీష్‌, లేబర్‌ యూనియన్‌ మండల అధ్యక్షుడు ఆనదం, నాయకులు సంజీవులు, అశోక్‌, చంద్రయ్య, రాజు, శ్రీనివాస్‌, లాలిబాయి తదితరులు ఉన్నారు.

వ్యక్తి బలవన్మరణం

దోమ: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన దోమ పీఎస్‌ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ ఆనంద్‌కుమార్‌ తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని కిష్టాపూర్‌ గ్రామానికి చెందిన నందార్‌పేట్‌ లక్ష్మయ్య(52) తన భార్య మొగులాలీతో తరుచూ గొడవ పడుతూ ఉండేవాడు. బుధవారం గొడవపడిన ఆయన బొంరాస్‌పేట్‌ మండలం సాలిందాపూర్‌లోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. గురువారం తిరిగి ఇంటికి వస్తూ బ్రాహ్మణపల్లి తండా సమీపంలోని ఓ గేదెల షెడ్‌లో రాడ్డుకు తాడుతో ఉరేసుకున్నాడు. అటుగా వెళ్తున్న గ్రామస్తులు గమనించి మృతుడి భార్యకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

చికిత్స పొందుతున్న యువకుడి మృతి

దోమ: బైక్‌తో ట్రాలీని ఢీకొట్టిన ఘటనలో చికిత్స పొందుతున్న యువకుడు గురువారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని మోత్కూరు గ్రామానికి చెందిన సండి ధన్‌రాజ్‌(18), సండి సాయికుమార్‌ పరిగి వెళ్తున్న క్రమంలో మైలారం గేట్‌ సమీపంలో ట్రాక్టర్‌ ట్రాలీని బలంగా ఢీకొట్టిన విషయం విదితమే. ఈ క్రమంలో క్షతగాత్రులను కుటుంబ సభ్యులు వికారాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వీరిలో ధనరాజ్‌ మృతి చెందగా.. సాయికుమార్‌ పరిస్థితి సైతం విషయమంగానే ఉందని ఎస్‌ఐ ఆనంద్‌కుమార్‌ తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ట్రాక్టర్‌ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

బైక్‌ను ఢీకొట్టిన ఆటో

ద్విచక్ర వాహనదారుడి మృతి

మొయినాబాద్‌: బైక్‌ను ఆటో ఢీకొట్టడంతో ద్విచక్రవాహనదారుడు మృతి చెందాడు. ఈ ఘటన మొయినాబాద్‌ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. చిలుకూరు గ్రామానికి చెందిన బక్క రాజు(35) బాలాజీ ఆలయం వద్ద టెంకాయలు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి 9గంటల ప్రాంతంలో రాజు తన బైక్‌పై హిమాయత్‌నగర్‌ వెళ్లాడు. తిరిగి ఇంటికి వెళ్తుండగా చిలుకూరు మహిళ ప్రాంగణ సమీపంలో ఎదురుగా వస్తున్న అశోక్‌ లేలాండ్‌ ఆటో అతివేగంగా బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజుకు తీవ్రగాయాలవడంతో గమనించిన స్థానికులు స్థానిక భాస్కర ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కకు చేరుకుని మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారలు సంతానం. కేసు దర్యాప్తులో ఉంది.

ఉపాధి కూలీల బిల్లులు చెల్లించాలి 1
1/3

ఉపాధి కూలీల బిల్లులు చెల్లించాలి

ఉపాధి కూలీల బిల్లులు చెల్లించాలి 2
2/3

ఉపాధి కూలీల బిల్లులు చెల్లించాలి

ఉపాధి కూలీల బిల్లులు చెల్లించాలి 3
3/3

ఉపాధి కూలీల బిల్లులు చెల్లించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement