
ఆలయ నిర్మాణానికి సహకరించండి
తాండూరు రూరల్: పెద్దేముల్ మండలం గాజీపూర్‌లోని చెన్నకేశవ ఆలయ పునఃనిర్మాణానికి దాతలు సహకరించాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి అన్నారు. గురువారం ఆలయ అభివృద్ధికి సహకరించిన దాతలను సన్మానించారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డి మాట్లాడుతూ.. గాజీపూర్‌లో వెయ్యి ఏళ్ల క్రిందటి చెన్నకేశవ ఆలయం శిథిలావస్థకు చేరడంతో దాతల సహకారంతో పునఃనిర్మిస్తున్నామన్నారు. ఈ మేరకు దాతలు డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, ఎం.వెంకట్‌రెడ్డి, తాండూరు పట్టణానికి చెందిన వి.రాజేశ్, ఎల్.పవన్ విరాళం అందజేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, లాల్‌రెడ్డి, వీరప్ప, సాయిలు, రవి, వీరేందర్, సంగమేశ్వర్, నాగర్జునరెడ్డి, బిచ్చన్న, రాములు, రాంచెంద్రి, అంజి, వెంకటయ్య, రాంరెడ్డి, వేణు, సాయి, ప్రశాంత్ తదితరులు ఉన్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment