
భవనం పైనుంచి పడి వృద్ధుడి మృతి
మొయినాబాద్: మొదటి అంతస్తు పైనుంచి ప్రమాదవశాత్తు కింద పడి తీవ్ర గాయాలైన వృద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన మొయినాబాద్ పీఎస్ పరిధిలోని కనకమామిడిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన పెద్దింటి గోవింద్‌రెడ్డి(75) కుటుంబం మొదటి అంతస్తులో నివాసముంటున్నారు. బుధవారం రాత్రి బయట ఏదో గొడవ జరుగుతుందని చూడటానికి ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. మొదటి అంతస్తుకు రేలింగ్ లేకపోవడంతో ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడ్డిన ఆయన్ను కుటుంబ సభ్యులు నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వృద్ధుడు గురువారం సాయంత్రం మృతి చెందాడు. కేసు దర్యాప్తులో ఉంది.
ఎదురెదురుగా బైక్‌లు ఢీ
ఆర్టీసీ డ్రైవర్ మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
షాబాద్: ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీకొనడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన షాబాద్ ఠాణా పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని బోడంపహాడ్ గ్రామానికి చెందిన మొగిలిగిద్ద సుధాకర్, కొత్తపల్లి బాలయ్య బైక్‌పై ఇంటికి వెళ్తున్నారు. అదే గ్రామానికి చెందిన తిమ్మక్క రజినీకాంత్ తన ద్విచక్రవాహనంపై వెళ్తున్న క్రమంలో అంతారం స్టేజీ వద్ద ఈ రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సుధాకర్, రజనీకాంత్ తీవ్రంగా గాయపడడంతో షాద్‌నగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిగి డిపోలో ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్న సుధాకర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా బాలయ్య స్వల్పగాయాలతో బయటపడ్డాడు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.
భార్యను కడతేర్చిన భర్త
రహమత్‌నగర్ : కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి భార్యను హత్య చేసిన సంఘటన బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రహమత్‌నగర్ డివిజన్ రాజీవ్‌గాంధీ నగర్‌కు చెందిన నరేందర్ స్ధానికంగా మిల్క్ బూత్ నిర్వహిస్తున్నాడు. అతడికి భార్య పద్మ, కుమార్తె, కుమారుడు ఉన్నారు. గత కొంత కాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. బుధవారం రాత్రి కూడా వారి మధ్య మరోసారి గొడవ జరగడంతో ఆగ్రహానికి లోనైన నరేందర్ పద్మ(50)ను గొంతు నులిమి హత్య చేఽశాడు. గురువారం ఉదయం బోరబండ పోలీసుల ఎదుట లొంగి పోయాడు. సంఘటనా స్ధలాన్ని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్‌కుమార్, ఎస్‌ఆర్‌నగర్ ఏసీపీ వెంకటరమణ పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment