
తాగునీటికి తిప్పలు
తాండూరు: మున్సిపల్ పరిధిలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఏడాదిన్నర క్రితం మిషన్ భగీరథ పథకం కింద పలు వార్డుల్లో పైప్‌లైన్లు వేసి, ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు తాగునీరు సరఫరా కావడం లేదు. పాత తాండూరు, మల్‌రెడ్డిపల్లి, ఎన్‌టీఆర్ కాలనీ, రాజీవ్ గృహకల్ప కాలనీల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. మున్సిపల్ పరిధిలో 36 వార్డులు.. 14,706 గృహాలు ఉన్నాయి. మొత్తం 80 వేల జనాభా ఉంది. నిత్యం 9 ఎంఎల్‌డీ నీరు అవసరం ఉంటుంది. కాగ్నా నది వద్ద రెండు పంప్ హౌజ్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా పట్టణంలోని 6వేల ఇళ్లకు మాత్రమే నీటి సరఫరా జరుగుతోంది. మరో రెండు వేల ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చినా సరఫరా కావడం లేదు. ఎన్‌టీఆర్ కాలనీలో వాటర్ ట్యాంక్ నిర్మించి ఏళ్లు కావస్తున్నా అందుబాటులోకి తేలేదు. 325 బోరు మోటార్లు, 122 చేతి పంపులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని పాడయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment