
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
మైలార్‌దేవ్‌పల్లి: ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని బీఆర్‌ఎస్ యువజన విభాగం డివిజన్ అధ్యక్షుడు అక్కెం రాఘవేందర్‌యాదవ్ అన్నారు. శివాజీ చౌక్ సర్కిల్ వద్ద ఆదివారం కేటీఆర్, జగదీశ్వర్‌రెడ్డి దిష్టిబొమ్మలను కాంగ్రెస్ నాయకులు దహనం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 15 నెలలు కావస్తున్న కూడా అభివృద్ధిపై దృష్టి సాధించకపోవడం సిగ్గుచేటన్నారు. సచివాలయం ప్రాంగణంలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘనత కేసిఆర్‌కే దక్కుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదని హెచ్చరించారు.