అడ్డుకట్ట
అప్రమత్తతే.. సైబర్ నేరాలకు
తాండూరు టౌన్: అప్రమత్తతతో సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయొచ్చని ఎస్పీ నారాయణరెడ్డి అన్నారు. సోమవారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తాండూరు శాఖ ఆధ్వర్యంలో స్థానిక వినాయక కన్వెన్షన్ హాల్‌లో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో వ్యాపారులు, పలు స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన ఉంటే వాటి నుంచి రక్షించుకోవచ్చన్నారు. సైబర్ నేరాలు అనునిత్యం కొత్త రూపం దాల్చుకుని వ్యాపారులు, ఉద్యోగులు, రైతులు, ప్రజల నుంచి నగదును దోచేస్తున్నాయన్నారు. సైబర్ నేరగాళ్లు పలు రకాల ఆఫర్లు, ఈజీ మనీ వంటి వాటితో ప్రజలను తప్పుదోవ పట్టించి వారి ఖాతాలను ఖాళీ చేస్తున్నారని తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు సుమారు రూ.30వేల కోట్ల నగదును కొట్టేశారని, ఏడాదిన్నర కాలంలో రాష్ట్రంలో సైతం రూ.6 వేల కోట్ల మేర నగదును అమాయకులు పోగొట్టుకున్నారని పేర్కొన్నారు. బ్యాంకు ఖాతా నంబర్, కేవైసీ, పొరపాటున ఖాతాలోకి నగదు జమ చేశామని, ఏటీఎం కార్డు అప్‌డేట్ చేయాలని, లోన్స్ ఇస్తామని, మీ పేరుపై వచ్చిన పార్శిల్‌లో డ్రగ్స్ ఉన్నాయని, మీకు సంబంధించిన వారు కేసులో ఇరుక్కున్నారని పలు రకాలుగా సైబర్ దాడులు జరుగుతున్నాయని అన్నారు. డిజిటల్ అరెస్టు అనేది ఎక్కడా లేదని, లోకల్ పోలీసులు మీపై కేసు నమోదయ్యిందని ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వరన్నారు. ఇలాంటి సైబర్ దాడుల నుంచి ప్రజలు తమ ను తాము రక్షించుకోవాలన్నారు. ఇందుకు నిర్లక్ష్యం, భయాన్ని వీడి, ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించుకోవాలన్నారు. అనంతరం జిల్లా సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రశాంత్‌రెడ్డి, తాండూరు డీఎస్పీ బాలకృష్ణా రెడ్డి మాట్లాడా రు. సోషల్ మీడియా ద్వారా సైబర్ నేరాలపై ప్రజలకు అర్థమయ్యేలా ప్రచారం చేపట్టాలన్నారు. ఒకవేళ సైబర్ నేరగాళ్ల చేతిలో పడి నగదు పోగొట్టుకుంటే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు. దీనివల్ల కొట్టేసిన నగదును పలు బ్యాంకు ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్ కాకుండా అడ్డుకోవచ్చని పేర్కొన్నారు. కరోనా సమయంలో ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండి తమ ఆరోగ్యాన్ని కాపాడుకున్నారో, అలాగే సైబర్ నేరగాళ్ల నుంచి జరిగే దాడులను కూడా అరికట్టుకోవచ్చని తెలిపారు. అవగాహ న అనేది ఒక టీకా లాంటిదని, అది ఎలాంటి ప్రమాదాలు దరిచేరకుండా రక్షిస్తుందన్నారు. అనంతరం సైబర్ నేరాల అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తాండూరు అధ్య క్ష, కార్యదర్శులు డాక్టర్ జయప్రసాద్, డాక్టర్ అనిల్‌కుమార్, సీఐలు సంతోష్ కుమార్, నగేష్, ఎస్సైలు రమేష్, శంకర్ పాల్గొన్నారు.
ఐవీఎఫ్ సేవలు అభినందనీయం
ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సేవలు అభినందనీయమని ఎస్పీ నారాయణరెడ్డి అన్నారు. సోమవారం స్థానిక వినాయక కన్వెన్షన్ హాల్ లో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఐవీఎఫ్, తాండూరు పోలీసు శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని పలువురు ఆటో డ్రైవర్లకు ఎస్పీ చేతుల మీదుగా యూనిఫాంలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐవీఎఫ్ పలు సామాజిక కార్యక్రమాలు, సహాయ సహకారాలు అందించడం హర్షణీయమన్నారు. ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ, రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించాలన్నారు. కార్యక్రమంలో ఐవీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రొంపల్లి సంతోష్ కుమార్, డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, సీఐలు సంతోష్ కుమార్, నగేష్, ఎస్సైలు రమేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి
తాండూరు రూరల్: కొందరు కోట్ల రూపాయలు వెచ్చించి ఇల్లు కట్టుకుంటారని, వేల రూపాయల విలువ చేసే సీసీ కెమెరాలు పెట్టుకోరని ఎస్పీ నారాయణరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మండలంలోని కరన్‌కోట్ పోలీస్‌స్టేషన్‌లో 88 సీసీ కెమెరాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఒక్క సీసీ కెమెర వేయ్యి కళ్లతో సమానమన్నారు. ప్రతి గ్రామంలో, ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, రూరల్ సీఐ నగేష్, ఎస్‌ఐ విఠల్‌రెడ్డి, ఏఎస్‌ఐ పవన్ పాల్గొన్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఎస్పీ నారాయణరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment