ఎన్‌సీసీ యూనిట్‌ ఏర్పాటు చేయండి | - | Sakshi
Sakshi News home page

ఎన్‌సీసీ యూనిట్‌ ఏర్పాటు చేయండి

Published Tue, Mar 18 2025 9:11 AM | Last Updated on Tue, Mar 18 2025 10:10 PM

ఎన్‌స

ఎన్‌సీసీ యూనిట్‌ ఏర్పాటు చేయండి

కేంద్ర రక్షణ శాఖ సహాయమంత్రి

సంజయ్‌ సేత్‌ను కోరిన ఎంపీ కొండా

అనంతగిరి: వికారాబాద్‌లో ఎన్‌సీసీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కేంద్ర రక్షణ శాఖ సహాయమంత్రి సంజయ్‌ సేత్‌ను కోరారు. సోమవారం ఢిల్లీలో ఆయన్ను కలసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించా రని ఎంపీ తెలిపారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ.. వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌, చేవెళ్ల నియోజకవర్గ విద్యార్థుల కోసం వికారాబాద్‌లో ఎన్‌సీసీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఎన్‌సీసీతో క్రమశిక్షణ, దేశభక్తి తోపాటు ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో కూడా రిజర్వేషన్‌ పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. గత ఏడాది ఈ విషయమై సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాయడం జరిగిందని, ప్రభుత్వం సానుకూలంగా స్పందించారని తెలిపారు.

బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా రాజశేఖర్‌రెడ్డి

పరిగి: బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్‌ కొప్పు రాజశేఖర్‌రెడ్డి నియమితులయ్యారు. సోమవా రం పార్టీ రాష్ట్ర శాఖ ఎనిమిది జిల్లాలకు అధ్య క్షులను ప్రకటించింది. ఈ జాబితాలో రాజశేఖర్‌రెడ్డికి చోటు లభించింది. జిల్లా అధ్యక్ష పదవి కోసం పార్టీ సీనియర్‌ నాయకులు శివరాజ్‌, సదానందరెడ్డి, రమేష్‌, వడ్ల నందు, రాజశేఖర్‌రెడ్డి పోటిపడ్డారు. అదిష్టానం రాజశేఖర్‌రెడ్డి వైపు మొగ్గు చూపింది.

ఇంటివద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు

పరిగి: ఇంటి వద్దకే భద్రాద్రి సీతారాముల కల్యాణ ముత్యాల తలంబ్రాలు ఆర్టీసీ అందిస్తుందని రంగారెడ్డి రీజియన్‌ లాజిస్టిక్‌ ఏటీఎం రవీందర్‌ అన్నారు. సోమవారం పరిగి కార్గో కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..రెండు దఫాలుగా భద్రాద్రి రా మయ్య ముత్యాల తలంబ్రాలను ఆర్టీసీ కార్గో భక్తులకు అందజేసిందన్నారు.భక్తులు రూ.151 చెల్లించి ముందుగానే బుక్‌ చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్‌ 6న సీతారాముల కల్యా ణం జరుగుతుందని.. ఏప్రిల్‌ 7వ తేదీ వరకు దగ్గరలోని కార్గో సెంటర్‌లో బుక్‌ చేసుకో వచ్చని తెలిపారు.

గ్రూప్‌–3లో సత్తాచాటిన శ్రవణ్‌కుమార్‌

కుల్కచర్ల: తెలంగాణ గ్రూప్‌–3 ఫలితాల్లో కుల్కచర్ల మండలం ఇప్పాయిపల్లికి చెందిన శ్రవణ్‌కుమార్‌ సత్తాచాటారు. రెండు రోజులక్రితం విడుదలైన ఫలితాల్లో 208వ ర్యాంకు సాధించారు. ప్రస్తుతం శ్రవణ్‌ కుమార్‌ రంగారెడ్డి జిల్లా సాతంరాయి కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ఎన్‌సీసీ యూనిట్‌  ఏర్పాటు చేయండి 
1
1/3

ఎన్‌సీసీ యూనిట్‌ ఏర్పాటు చేయండి

ఎన్‌సీసీ యూనిట్‌  ఏర్పాటు చేయండి 
2
2/3

ఎన్‌సీసీ యూనిట్‌ ఏర్పాటు చేయండి

ఎన్‌సీసీ యూనిట్‌  ఏర్పాటు చేయండి 
3
3/3

ఎన్‌సీసీ యూనిట్‌ ఏర్పాటు చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement