ఎమ్మెల్యే నిధులతో సీసీ రోడ్డు పనులు
పూడూరు: మారుమూల గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని మాజీ సర్పంచ్ విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని మేడిపల్లికలాన్ గ్రామంలో రూ.5లక్షల ఎమ్మెల్యే నిధులతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో మౌలిక సదుపాయాలను కల్పించేలా ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో నా యకులు కృష్ణయ్య, సల్మాన్, సుధాకర్‌రెడ్డి, శ్రీధర్, రాంచంద్రయ్య, పాల్గొన్నారు.
సమాచారం కోసం సంప్రదించండి
జిల్లా వ్యవసాయాధికారి మోహన్‌రెడ్డి
అనంతగిరి: వ్యవసాయ శాఖకు సంబంధించిన రైతు బీమా, రైతు భరోసా, రుణమాఫీ, పీఎం కిసాన్ సమాచారం కోసం గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసినట్లు జిల్లా వ్యవసాయాధికారి మోహన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రైతుబీమా కోసం అనిల్‌కుమార్(జూనియర్ అసిస్టెంట్) 99892 91049, రైతుభరోసా–పీఎం కిసాన్ సమస్యల కోసం ప్రశాంత్(జూనియర్ అసిస్టెంట్) 90103 39211, రుణమాఫీ మిగతా స్కీంలకు తేజస్ నాయక్(జూనియర్ అసిస్టెంట్) 82473 73976లో సంప్రదించాలన్నారు. జిల్లాలోని రైతులు స్కీంలకు సంబంధించిన సమాచారం కోసం ఈ ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు.
కోలాటం కళాకారుల ఉత్తమ ప్రదర్శన
పరిగి: మండల పరిధిలోని మిట్టకోడూర్ కోలాటం కళాకారులు ఉత్తమ ప్రతిభ చాటారు. ఆదివారం రాత్రి నగరంలోని రవీంద్ర భారతిలో ఉగాది పురస్కారాల కార్యక్రమంలో భాగంగా అభియాన్ ఆర్ట్స్ అకాడమి సహకారంతో కోలాటం ప్రదర్శించారు. దీంతో ఉత్తమ కోలాట ప్రదర్శించిన కళాకారులకు ఆకాశమే అధ్యక్షురాలు కవిత తదితరులు ప్రశాంసా పత్రాలను అందజేశారు. రవీంద్ర భారతిలో ఉత్తమ ప్రతిభ కబర్చిన కళాకారులకు గ్రామస్తులు, మండల వాసులు అభినందిస్తున్నారు.
షాపింగ్‌కు వెళ్లొచ్చే సరికి చోరీ
పూడూరు: రంజాన్ షాపింగ్‌కు వెళ్లి వచ్చే సరికి ఇంట్లో దొంగలు పడి విలువైన వస్తువులు దోచుకెళ్లిన సంఘటన చన్గోముల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పూడూరు మండల కేంద్రానికి చెందిన పర్వీన్‌బేగం, అలీలు భార్యాభర్తలు. ఇరువురూ రంజాన్ పండుగ సందర్భంగా షాపింగ్ చేసేందుకు సోమవారం వికారాబాద్‌కు వెళ్లారు. తిరిగి సాయంత్రం వచ్చే సరికి ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించి, వెళ్లి చూడగా బీరువా తెరిచి ఉంది. అందులో ఉన్న రూ.53,000 విలువగల బంగారు, వెండి ఆభరణాలు, కొంత నగదు పోయిందని తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అడవిలో మంటలు
పూడూరు: వేసవి కాలంలో అడవుల పరిరక్షణ చర్యలు చేపట్టడంలో అటవీ శాఖ అధికారులు విఫలమయ్యారు. వేసవిలో తరచూ అడవులు తగులబడి పోతాయని తెలిసినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని స్థానిక నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం మండలంలోని తిర్మలాపూర్ అటవీ ప్రాంతం తగులబడిపోతున్నా ఫారెస్టు అధికారులు అటు వైపు కన్నెత్తి చూడలేదు. స్థానిక నాయకులతో కలిసి మాజీ సర్పంచ్ మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. గడ్డి పూర్తిగా ఎండిపోవడంతో మంటలు అదుపులోకి రాలేదు. వేసవిలో అటవీ ప్రాంతంలో కందకాలు ఏర్పాటు తవ్వించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు.
ఎమ్మెల్యే నిధులతో సీసీ రోడ్డు పనులు
ఎమ్మెల్యే నిధులతో సీసీ రోడ్డు పనులు
Comments
Please login to add a commentAdd a comment