
గడ్డి విత్తనాలకు మంగళం
దౌల్తాబాద్: ప్రస్తుత పరిస్థితుల్లో పశుపోషణ భారంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతీ సంవత్సరం పంపిణీ చేసే గడ్డి విత్తనాల సరఫరాలో ఈ ఏడాది అంతరాయం ఏర్పడింది. దీంతో మూగజీవాలకు పశుగ్రాసం దొరకడం ఇబ్బందిగా మారింది. మండల పరిధిలో 80శాతం వ్యవసాయం చేసే రైతులకు పశువులున్నాయి. ఈ ఏడాది పశు సంవర్ధక శాఖ ద్వారా అందించే గడ్డి విత్తనాలకు ప్రభుత్వం మొండిచేయి చూపింది.
పశువైద్యశాలకు చేరని విత్తనాలు
మండల పరిధిలో 33 పంచాయతీలున్నాయి. ప్రతీ సంవత్సరం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో 75శాతం రాయితీపై గడ్డి విత్తనాలు సరఫరా చేసేవారు. ఇందుకు ప్రత్యేక బడ్జెట్ కెటాయించేవారు. ఈ విత్తనాలు జనవరి, ఫిబ్రవరి మాసాల్లో పశువైద్యశాలకు చేర్చి అక్కడి నుంచి రైతులకు రాయితీపై అందించేవారు. కానీ ఈ ఏడాది రాయితీ విత్తనాలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడంతో పంపిణీ నిలిచిపోయినట్లు తెలుస్తోంది. యాసంగి ఆరంభంలో పంపిణీ చేసే గడ్డివిత్తనాలు రైతులు వేసవిని దృష్టిలో పెట్టుకుని సాగు చేశారు. తద్వారా గ్రాసం కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకునేవారు. కానీ ఈ సారి ఇప్పటి వరకు కూడా గడ్డి విత్తనాలు పశువైద్యశాలకు రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరి కొంతమంది రైతులు కర్ణాటక రాష్ట్రంలో చొప్పను కొనుగోలు చేసి తెప్పించుకుంటున్నారు. కొంతమంది రైతుల వద్ద వరిగడ్డిని కొనుగోలు చేసి తరలిస్తున్నారు.
నిలిచిన సరఫరా
పశుగ్రాసం కోసం తిప్పలు
కర్ణాటక నుంచి కొనుగోలు చేస్తున్న రైతులు
ప్రత్యామ్నాయ చర్యలు
గడ్డి విత్తనాలు ఇప్పటి వరకు అందకపోవడంతో రైతులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నారు. జొన్న, మొక్కజొన్న పంటల వైపు దృష్టి సారించారు. తమ పొలంలో బోర్లు వేసి బిందు సేద్యం ద్వారా మొక్కజొన్న, జొన్న పంటలను పండిస్తున్నారు. వర్షాధారిత పంటల రైతులు మాత్రం బయటి నుంచి పశుగ్రాసం కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి గడ్డి విత్తనాలు పంపిణీ చేయాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయమై పశువైద్యశాఖ అధికారి సత్యనారాయణరెడ్డిని వివరణ కోరగా ప్రభుత్వం నుంచి గడ్డి విత్తనాల సరఫరా లేదు. రైతులు ప్రతి రోజు వచ్చి అడుగుతున్నారు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియజేశాం.

గడ్డి విత్తనాలకు మంగళం
Comments
Please login to add a commentAdd a comment