బీసీల చిరకాల స్వప్నం సాకారం
పరిగి: ఎన్నికల ముందు బీసీలకు న్యాయం చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన మాట నిలబెట్టుకున్నారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్, డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్‌కృష్ణ అన్నారు. అసెంబ్లీలో బీసీ బిల్లు ప్రవేశపెట్టినందుకుగాను మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఒకే సారి రెండు బీసీ బిల్లులను ప్రవేశపెట్టిన ఘటన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికే దక్కుతుందన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్‌లు కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బిల్లుతో ఎంతో మేలు చేకూరుతుందన్నారు. బీసీ బిల్లును ప్రవేశపెట్టాలని బీఆర్‌ఎస్ ప్రభుత్వం దృష్టికి ఎన్ని సార్లు తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. బీసీల చిరకాల స్వప్నం నెరవేరిందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధానకార్యదర్శి హన్మంతుముదిరాజ్, చిన్న నర్సింలు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అయూబ్, అడ్వకేట్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
సీఎం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ లాల్‌కృష్ణ
Comments
Please login to add a commentAdd a comment