చిరుత కాదు.. అడవి పిల్లి
● ట్రాప్ కెమెరాల్లో నమోదైన దృశ్యాలు ● నిర్ధారించిన అటవీశాఖ అధికారులు ● ఊపిరి పీల్చుకున్న కార్మికులు, ప్రజలు
తాండూరు రూరల్: మండలంలోని మల్కాపూర్, సంగెంకలాన్ గ్రామ శివారులో సంచరిస్తోంది చిరు తపులి కాదని.. అడవి పిల్లి అన్ని అటవీశాఖ అధికారులు తేల్చారు. వారు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో అడవి పిల్లి సంచరిస్తున్న దృశ్యాలు నమోదయ్యాయి. దీంతో కార్మికులు, చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మల్కాపూర్ శివారులోని సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. ఈ పరిశ్రమకు సంబంధించిన ముడిసరుకు కోసం మల్కాపూర్, సంగెంకలాన్ గ్రామ శివారులో 1,392 ఎకరాల్లో నాపరాతి క్వారీ ఉంది. ఇది అటవీ ప్రాంతంలో ఉంది. వారం రోజుల క్రితం క్వారీలో పనిచేసే కార్మికుడికి అడవి జంతువు కనిపించింది. అది చిరుతపులిని పోలినట్లు ఉండటంతో అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు సోమవారం క్వారీ సమీపంలోని నీటికుంట వద్ద, సంగెంకలాన్ శివారులోని అటవీ ప్రాంతంలో ఐదు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో నీటికుంట వద్దకు అడవిపిల్లి వచ్చింది. ఈ దృశ్యాలు కెమెరాల్లో నమోదయ్యాయి. ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులు ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఈ ప్రాంతంలో సంచరిస్తోంది చిరుతపులి కాదని, అడవి పిల్లి అని ప్రజలు, కార్మికులు భయాందోళన చెందరాదని తాండూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీదేవి సరస్వతి, ఇన్‌చార్జ్ సెక్షన్ ఆఫీసర్ పిర్యానాయక్ సూచించారు. అడవి పిల్లి వల్ల ఎలాంటి హాని ఉండదని వారు తెలిపారు.
చిరుత కాదు.. అడవి పిల్లి
Comments
Please login to add a commentAdd a comment