‘ఆహార భద్రత’కు భంగం కలిగిస్తే చర్యలు
● రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి
కడ్తాల్: ఆహార భద్రత హక్కుకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవని స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మండల కేంద్రంలోని ఓ రేషన్ దుకాణంతో పాటు, అంగన్వాడీ కేంద్రం, బాలికల ప్రాథమికోన్నత పాఠశాల, బాలుర ఉన్నత పాఠశాల, కేజీబీవీ, గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాల, వసతి గృహాలను ఫుడ్ కమిషన్ సభ్యులు ఓరుగంటి ఆనంద్, గోవర్ధన్‌రెడ్డి, జ్యోతి, అధికారులతో కలిసి తనిఖీలు నిర్వ హించారు. ముందుగా మండల కేంద్రంలోని గాంధీనగర్ కాలనీలోని రేషన్‌షాపును తనిఖీలు చేపట్టారు. అంత్యోదయ కార్డు లబ్ధిదారులకు పంచ దార అందించడం లేదని తెలుసుకున్నారు. దీనిపై 30 రోజుల్లో కమిషన్‌కు నివేదిక అందించాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారిని ఆదేశించారు. రేషన్ షాపుల వద్ద ఫిర్యాదు బాక్స్, స్టాక్ వివరాలు, సంబంధిత పౌర సరఫరా శాఖ అధికారుల ఫోన్ నంబర్ల వివరాలు ఖచ్చితంగా పెట్టాలని కమిషన్ బృందం ఆదేశించింది. అనంతరం అంగన్వాడీ కేంద్రం–2, 4 కేంద్రాలను సందర్శించి చిన్నారులకు, బాలింతలకు అందిస్తున్న పౌష్టికాహరం నిల్వలను, రికార్డులను పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రంలో అందిస్తున్న గుడ్డు పరిమాణం తక్కువగా ఉందని.. ఏజెన్సీకి నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment