సత్ప్రవర్తనతో మెలగాలి
జిల్లా లీగల్ సర్వీస్
అథారిటీ సెక్రటరీ, జడ్జి శీతల్
పరిగి: ఒక్కసారి జైలు జీవితం గడిపిన వారు మళ్లీ జైలుకు రాకుండా సత్ప్రవర్తనతో మెలగాలని జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ జడ్జి శీతల్ అన్నారు. బుధవారం పరిగి సబ్‌జైలును సందర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఖైదీలకు ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తెస్తే వాటిని పరిష్కరిస్తామన్నారు. కొంత మంది అనుకోని సంఘటనల వల్ల జైలుకు వస్తారని, మరి కొంత మంది క్షణికావేశంలో చేసిన తప్పులకు ఇక్కడికి వస్తారని తెలిపారు. జైలు జీవితం గడపం అంటే మంచి ప్రవర్తన గల వ్యక్తిగా మారడం అని అన్నారు. బెయిల్ పిటీషన్ వేసుకోలేని వారు ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పేద ఖైదీలకు న్యాయం చేయాలని న్యాయవాదులకు సూచించారు. అనంతరం బాలసదనంను సందర్శించి చిన్నారుల బాగోగులు తెలుసుకున్నారు. కార్యక్రంమలో జైలు సూపరింటెండెంట్ రాజ్‌కుమార్, న్యాయవాదులు వెంకటేష్, శ్రీనివాస్, గౌస్‌పాష తదితరులు పాల్గొన్నారు.
మామిడి సాగులో
జాగ్రత్తలు పాటించాలి
హార్టికల్చర్ జిల్లా ఇన్‌చార్జ్ అధికారి కమల
అనంతగిరి: ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున మామిడి సాగులో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని హార్టికల్చర్ జిల్లా ఇన్‌చార్జ్ అధికారి కమల సూచించారు. బుధవారం వికారాబాద్ మండలంలో మామిడి తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మామిడి తోటలకు డ్రిప్ విధానంతో ఒక్కో చెట్టుకు రోజుకు 3 గంటల పాటు నీరు పెట్టాలని తెలిపారు. ఉదయం గంటన్నర, సాయంత్రం గంటన్నర పాటు నీరు పడితే మట్టిలో తేమశాతం నిలకడగా ఉండి చెట్లు ఆరోగ్యంగా ఉంటాయన్నారు. డ్రిప్ పరకరాలను చెట్టు కాండానికి 1.5 మీటర్ల దూరంలో అమర్చాలని సూచించారు. పది సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న చెట్లకు 500 గ్రాముల యూరియా, 500 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అందించటం వలన మామిడి కాయలు బాగా వస్తాయని తెలిపారు. ఫిప్రోనేల్ 2ఎంఎల్‌ను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయడం వల్ల తామర పురుగు బెడద నుంచి పంటను కాపాడుకోవచ్చన్నారు. తేనె మంచు పురుగు నివారణకు బప్రొఫెజిన్ 1.5 మిల్లీ లీటర్లను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు. మామిడి పిందె నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు ప్లానోఫిక్స్ ఒక మిల్లీ లీటరును 4.5 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయడం వల్ల కాత రాలడాన్ని నివారించవచ్చని తెలిపారు.
బిల్లు ఆమోదం
బీసీల విజయం
● బీసీ యువజన సంఘంరాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్
బషీరాబాద్: విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం అసెంబ్లీలో చట్టబద్దత కల్పించడంపై బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఈడిగి శ్రీనివాస్‌గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్రంలోని ప్రతి బీసీ బిడ్డ విజయమన్నారు. బుధవారం అసెంబ్లీ హాలులో బీసీ యువజన నాయకులతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ చట్టం చేశారని అన్నారు. బిల్లు ఆమోదానికి కృషి చేసిన పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సహకరించిన బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐ పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు.
సత్ప్రవర్తనతో మెలగాలి
సత్ప్రవర్తనతో మెలగాలి
Comments
Please login to add a commentAdd a comment