
35 క్వింటాళ్ల బియ్యం పట్టివేత
యాలాల: జిల్లాలో టాస్క్‌ఫోర్స్ అధికారులు, స్థానిక పోలీసులతో కలిసి బుధవారం జరిపిన దాడుల్లో వేర్వేరు ప్రాంతాల్లో 35 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడింది. వివరాలిలా ఉన్నాయి. అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని సివిల్ సప్లయ్ అధికారులు యాలాల మండలంలోని ఇందిరమ్మ కాలనీలో స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ గిరి తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీకి చెందిన మహేష్‌చంద్ర అనే వ్యక్తి పీడీఎస్ బియ్యాన్ని కొంటూ వ్యాపారం చేస్తుంటాడు. కాగా భారీగా పీడీఎస్ బియ్యాన్ని ఓ ప్రదేశంలో నిల్వ ఉంచారనే సమాచారంతో పోలీసులు, సివిల్ సప్లయ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో 29 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం, ఓ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బియ్యాన్ని ఎంఎల్‌ఎస్ పాయింట్‌కు తరలించి, ఆటోను యాలాల పీఎస్‌కు తరలించినట్లు సివిల్ సప్లయ్ డిప్యూటీ తహసీల్దార్ గణపతి తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
మరో ఘటన..
కుల్కచర్ల: నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని మండల పరిధిలో టాస్క్‌ఫోర్స్ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పాయిపల్లి గ్రామానికి చెందిన సంగమేశ్వర్ ఇంటి వద్ద 6 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ అధికారులు స్థానిక పోలీసుల సహకారంతో దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ అన్వేష్‌రెడ్డి తెలిపారు.
టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు
Comments
Please login to add a commentAdd a comment