
మెరుగైన వైద్యం అందించండి
తాండూరు రూరల్: ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన రోగులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ సుధీర్ సూచించారు. బుధవారం సాయంత్రం మండలంలోని జినుగుర్తి గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఇన్ పేషంట్, లాబరేటరీ, ఔట్ పేషంట్ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. వైద్యశాలకు వచ్చిన రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. పీహెచ్‌సీలో అన్ని రకాల రక్త పరీక్షలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆవరణలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అందుకు లైట్లు, ఫ్యాన్లు సమకుర్చుకోవాలని సూచించారు.
బీసీ హాస్టల్ పరిశీలన
అనంతరం తాండూరు పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో ఉన్న బీసీ హాస్టల్‌ను అడిషనల్ కలెక్టర్ సుధీర్ తనిఖీ చేశారు. హాస్టల్ పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం వడ్డించాలని ఆదేశించారు. కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాలని చిన్నారులకు సూచించారు. చదువు ప్రాధాన్యాన్ని వివరించారు. కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ శ్రీశైలం, పట్టణ ఆర్‌ఐ అశోక్, వైద్య సిబ్బంది ఉన్నారు.
జిల్లా అడిషనల్ కలెక్టర్ సుధీర్
జినుగుర్తి పీహెచ్‌సీ ఆకస్మిక తనిఖీ
Comments
Please login to add a commentAdd a comment