
మల్కాపూర్‌లో అధికారుల తనిఖీ
తాండూరు రూరల్: మండల పరిధిలోని మల్కాపూర్ శివారు ప్రభుత్వ భూమిలో నాపరాతి తవ్వకాలపై మైనింగ్, రెవెన్యూ అధికారులు తనిఖీ చేపట్టారు. గ్రామంలోని సర్వేనంబర్ 72లో ఉన్న అసైన్డ్ భూమిలో అక్రమంగా నాపరాతి తవ్వకాలు చేపడుతున్నట్లు గ్రామస్తులు తుకారాం ఇటీవల కలెక్టర్ ప్రతీక్‌జైన్‌కు ఫిర్యాదు చేశాడు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం తాండూరు మైనింగ్ ఏడీ సత్యనారాయణ, ఆర్‌ఐ గోపి, సర్వేయర్ మహేశ్ బృందం నాపరాతి తవ్వకాలను పరిశీలించారు. తవ్వకాలను పరిశీలించిన అధికారులు వెనుదిరిగారు. దీంతో గ్రామస్తులు తుకారాం, మహేందర్‌రెడ్డి, చిరంజీవి మైనింగ్ అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎటువంటి లీజు లేకుండా జట్టురు మల్లమ్మ, కుర్వ మల్లప్ప పేరిట ఉన్న అసైన్డ్ భూమిలో నెల రోజులుగా తవ్వకాలు చేపడుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమార్కుల అందిస్తున్న లంచాలు తీసుకుని తవ్వకాలను అడ్డుకోవడం లేదని ఆరోపించారు. ఈ విషయమై మరోమారు కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. కాగా ఇదే విషయమై స్పందించిన మైనింగ్ ఏడీ సత్యానాయణ మాట్లాడుతూ.. విచారణ చేశామని ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని అక్కడి నుంచి వెళ్లిపోయారు. రెవెన్యూ ఆర్‌ఐ గోపి మాత్రం తనకు ఈ విషయమై ఏమీ తెలియదని.. సమాచారం తెలుసుకునేందుకు వెళ్లాలని చెప్పడం గమనర్హం.
మైనింగ్ అధికారుల తీరుపై గ్రామస్తుల ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment