
డాడీస్ యాప్‌తో వాహనదారులకు మేలు
దుద్యాల్: డాడీస్ యాప్ వాహనదారులకు, ప్రయాణికులకు ఎంతో ఉపయోగం అని డాడీస్ రోడ్డు ప్రతినిధి శ్రీశైలం అన్నారు. శుక్రవారం ఆయన మండల పరిధిలోని హకీంపేట్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. డాడీస్ యాప్‌నకు సంబంధించిన క్యూర్ కోడ్ స్టిక్కర్‌ను వాహనాలకు అంటించి వారి వారి మొబైల్ ఫోన్‌లలో యాప్ ఆక్టివేషన్ చేశారు. దీంతో సంబంధిత బైక్ ప్రమాదానికి గురైనప్పుడు క్యూఆర్ కోడ్ ద్వారా ప్రమాదాన్ని గుర్తించి ఆంబులెన్స్‌కు సమాచారం చేరుతుందన్నారు. ఎక్కడ ప్రమాదం జరిగినా వెంటనే వ్యకికి సంబంధించిన ఫోన్ ద్వారా ప్రమాదం చూసిన వ్యక్తి క్యూర్ కోడ్‌ను స్కానింగ్ చేయడం ద్వారా లోకేషన్ అలర్ట్ వస్తుందని అన్నారు. దీంతో మేము వెంటనే పోలీసులకు, అంబులెన్స్‌కు సమాచారం అందిస్తామన్నారు. వాహనాలు ఉన్న ప్రతీ ఒక్కరు ఈ యాప్‌ను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు సంజీవ రెడ్డి, గ్రామస్తులు వెంకటయ్య, శివరాజ్, భాస్కర్, విఠల్ తదితరులు పాల్గొన్నారు.