
క్రీడలతో నూతనోత్తేజం
మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం
చేవెళ్ల: క్రీడలు యువతలో నూతన ఉత్తేజాన్ని నింపుతాయని మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం అన్నారు. పట్టణ కేంద్రంలో నెల రోజులుగా కొనసాగుతున్న పెద్దోళ్ల పర్మయ్య మెమోరియల్ మండల స్థాయి క్రికెట్ టోర్నీ శుక్రవారంతో ముగిసింది. ఈ పోటీల్లో విజేతలకు పర్మన్న చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దయాకర్, కేఎస్ రత్నం నగదు బహుమతులు అందజేశారు. విజేత జట్టు ఊరెళ్లకు రూ.50వేలు, రన్నరప్ జట్టు రామన్నగూడకు రూ.25వేల నగదు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా దయాకర్, కేఎస్ రత్నం మాట్లాడుతూ.. యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజీపీ మండల అధ్యక్షుడు అత్తెల్లి అనంత్‌రెడ్డి, యువ నాయకుడు డాక్టర్ మల్గారి వైభవ్‌రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ కె. శివప్రసాద్, నాయకులు వెంకట్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, ఇంద్రాసేనారెడ్డి, జహంగీర్, నర్సింలు, పి. ప్రభాకర్, యువకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
మత్తు మందు స్ప్రే చేసి..
మహిళ మెడలోంచి పుస్తెలతాడు చోరీ
బొంరాస్‌పేట: గుర్తు తెలియని దుండగుడు మహిళపై మత్తు మందు స్ప్రే చేసి ఆమె మెడలోంచి బంగారు పుస్తెలతాడు చోరీ చేశాడు. ఈ ఘటన మండల పరిధిలోని తుంకిమెట్లలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వడ్ల బ్రహ్మచారి పరీక్షకు వెళ్లగా భార్య సుష్మిత ఒంటరిగా ఉంది. మధ్యాహ్నం సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు ఆమె ముఖంపై మత్తు మందు స్ప్రే చేసి ఆమె మెడలోంచి 2.30 తులాల బంగారు పుస్తెలతాడు తెంచుకుని పరారయ్యాడు. బ్రహ్మచారి సోదరుడు శేఖర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment