ప్రశాంతంగా పది పరీక్షలు ప్రారంభం
కొత్తగడి రెసిడెన్షియల్ సెంటర్ వద్ద సిబ్బందితో మాట్లాడుతున్న ఎస్పీ నారాయణరెడ్డి
పదో తరగతి వార్షిక పరీక్షలు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థులు నిర్ణీత సమయం కంటే ముందే కేంద్రాలకు చేరుకున్నారు. మొదటి రోజు పరీక్ష కావడంతో విద్యార్థుల వెంట తల్లిదండ్రులు, కుటుంబీకులు వచ్చారు. క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే సెంటర్లలోకి అనుమతించారు. వికారాబాద్ పట్టణంలోని పలు కేంద్రాలను కలెక్టర్ ప్రతీక్‌జైన్, ఎస్పీ నారాయణరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సెంటర్లలోకి వెళ్లే సమయంలో కలెక్టర్ తన సెల్‌ఫోన్‌ను బయట ఉంచారు. జిల్లా వ్యాప్తంగా 12,892 మంది పదో తరగతి విద్యార్థులు ఉండగా శుక్రవారం నిర్వహించిన తెలుగు పరీక్షకు 12,832మంది హాజరుకాగా 60మంది గైర్హాజరయ్యారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించి విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. – అనంతగిరి
ప్రశాంతంగా పది పరీక్షలు ప్రారంభం
ప్రశాంతంగా పది పరీక్షలు ప్రారంభం
ప్రశాంతంగా పది పరీక్షలు ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment