శ్రీవారి వార్షికబ్రహ్మోత్సవాలకు రండి | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి వార్షికబ్రహ్మోత్సవాలకు రండి

Published Sat, Mar 22 2025 9:13 AM | Last Updated on Sat, Mar 22 2025 9:12 AM

శ్రీవ

శ్రీవారి వార్షికబ్రహ్మోత్సవాలకు రండి

సీఎంను ఆహ్వానించిన ఆలయ ధర్మకర్తలు

కొడంగల్‌: పట్టణంలోని పద్మావతీ సమేత శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు రావాలని ఆలయ ధర్మకర్తలు సీఎం రేవంత్‌రెడ్డిని శుక్రవారం ఆహ్వానించారు. హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ నెల 24వ తేదీ నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తిరుమల తిరుపతి తరహాలో ఇక్కడ నిత్యం స్వామివారికి వాహన సేవలు నిర్వహిస్తారు. వైఖానస ఆగమ శాస్త్రోకంగా నిత్య పూజలు, కై ంకర్యాలు నిర్వహిస్తారు. సీఎంను కలిసిన వారిలో కాంగ్రెస్‌ పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు నందారం ప్రశాంత్‌, ఆలయ ధర్మకర్తలు నందారం శ్రీనివాస్‌, రత్నం, ఓం ప్రకాశ్‌, రాజేందర్‌ ఉన్నారు.

ధారూరు తైబజార్‌ వేలం

రూ.6.01 లక్షలకు దక్కించుకున్న మహేశ్‌

ధారూరు: ధారూరు తైబజార్‌ వేలం శుక్రవారం నిర్వహించారు. తిమ్మానగర్‌ గ్రామానికి చెందిన కే మహేశ్‌ రూ.6.01 లక్షలకు పాట పాడి రెండోసారి దక్కించుకున్నారు. గత ఏడాది రూ.4.08 లక్షలకు తైబజార్‌ దక్కించుకున్నారు. ప్రతి శనివారం నిర్వహించే కూరగాయల మార్కెట్‌లో వ్యాపారుల నుంచి నిర్ణీత రుసుం వసూలు చేసుకోవాల్సి ఉంటుంది. గ్రామ కార్యదర్శి అంజానాయక్‌ ఆధ్వర్యంలో వేలం నిర్వహించగా వ్యాపారులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

పరీక్ష కేంద్రంలో

ఫ్యాన్ల ఏర్పాటు

తాండూరు రూరల్‌: మండలంలోని మల్కాపూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదో తరగతి పరీక్ష కేంద్రంలో ఫ్యాన్లు, సౌకర్యాలు సరిగ్గా లేకపోవడంపై శుక్రవారం సాక్షి దినపత్రికలో ఇదేం పరీక్ష కేంద్రం అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి విద్యాశాఖ జిల్లా అధికారులు స్పందించారు. శుక్రవారం పాడైన ఫ్యాన్ల స్థానంలో కొత్తవాటిని అమర్చారు. మరో తరగతి గదిలో కొత్తగా రెండింటిని ఏర్పాటు చేశారు.

24న కౌన్సెలింగ్‌

అనంతగిరి: జిల్లాలో ఎంఎల్‌హెచ్‌పీ (మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌) పోస్టులకు ఎంపికై న 14మంది అభ్యర్థులకు ఈ నెల 24న కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ వెంకటరవణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30గంటలకు కలెక్టరేట్‌లోని ఎస్‌ –17 హాల్‌లో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంపికై న అభ్యర్థుల జాబితాను జిల్లా వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు.

ఆశావర్కర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

తాండూరు టౌన్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఆశావర్కర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఆశావర్కర్లకు ఇచ్చిన హామీ ప్రకారం కనీస వేతనం రూ. 18 వేలు ఇవ్వాలన్నారు. ఈఎస్‌ఐ, పీఎఫ్‌, ఉద్యోగ భద్రత, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌, రూ.50 లక్షల ఇన్సూరెన్స్‌ వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు. ఆశావర్కర్లపై పీహెచ్‌సీ అధికారుల వేధింపులను అరికట్టాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఆశావర్కర్లు రేణుక, అనిత, అరుణ, యాదమ్మ, హేమలత తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
శ్రీవారి వార్షికబ్రహ్మోత్సవాలకు రండి 
1
1/4

శ్రీవారి వార్షికబ్రహ్మోత్సవాలకు రండి

శ్రీవారి వార్షికబ్రహ్మోత్సవాలకు రండి 
2
2/4

శ్రీవారి వార్షికబ్రహ్మోత్సవాలకు రండి

శ్రీవారి వార్షికబ్రహ్మోత్సవాలకు రండి 
3
3/4

శ్రీవారి వార్షికబ్రహ్మోత్సవాలకు రండి

శ్రీవారి వార్షికబ్రహ్మోత్సవాలకు రండి 
4
4/4

శ్రీవారి వార్షికబ్రహ్మోత్సవాలకు రండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement