పల్లె దవాఖానా.. పశువుల కొట్టమా!
దౌల్తాబాద్: మండల పరిధిలోని ఈర్లపల్లిలో నిర్మించిన ఆరోగ్య కేంద్ర భవనం పశువుల కొట్టంలా మారింది. 2009లో అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దీన్ని ప్రారంభించారు. కొద్ది రోజుల పాటు ఇక్కడ సేవలు అందించిన వైద్యారోగ్య శాఖ అధికారులు.. వసతులు లేవని, ఊరికి దూరంగా ఉందనే కారణాలతో భవనాన్ని వదిలేశారు. అనంతరం గ్రామంలోని ఓ అద్దె గదిలో సేవలు కొనసాగించారు. ఇటీవల ప్రభుత్వం గ్రామాల్లోని ఆరోగ్య ఉప కేంద్రాలను పల్లె దవాఖానాలుగా మార్చింది. ఈ క్రమంలో అధికారుల ఆదేశం మేరకు ఈర్లపల్లిలోని ఉప కేంద్రానికి పల్లె దవాఖానా అని బోర్డు పెట్టారు. కానీ ఈ భవనంలో స్థానిక ఏఎన్‌ఎం కానీ వైద్యాధికారి కానీ ఏనాడూ సేవలందించిన దాఖలాలు లేవు. భవనానికి చెందిన కిటికీలు, తలుపులు చోరీకి గురయ్యాయి. ప్రస్తుతం ఇందులో పశువులను కట్టేస్తున్నారు. వైద్య సేవలు ఎక్కడ అందిస్తున్నారో స్థానికులకు కూడా తెలియని దుస్థితి. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
పదహారేళ్లుగా భవనం నిరుపయోగం
చోరీకి గురైన కిటికీలు, తలుపులు
వైద్య సేవలు అందక ప్రజల అవస్థలు
పల్లె దవాఖానా.. పశువుల కొట్టమా!
Comments
Please login to add a commentAdd a comment