అవినీతి జలగలపై సమగ్ర విచారణ
బషీరాబాద్: అంతారం – గొట్లపల్లి అర్బన్ పార్కు వాకింగ్ పాత్ పనుల్లో చోటుచేసుకున్న అక్రమాల్లో అటవీశాఖ అధికారుల పాత్రపై శుక్రవారం సాక్షి దినపత్రికలో ‘మట్టి పోశారు.. లక్షలు దోచారు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. దీనిపై అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ ప్రియాంక వర్గీస్ ఆరా తీసినట్లు తెలిసింది. డీఎఫ్‌ఓ జ్ఞానేశ్వర్‌ను హైదరాబాద్‌కు పిలిపించి వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం. సాయంత్రం తాండూరుకు వచ్చిన డీఎఫ్‌ఓ.. బీట్, సెక్షన్ ఆఫీసర్లను విచారించడం తోపాటు రికార్డులను పరిశీలించారు. ఎఫ్‌ఆర్‌ఓ శ్రీదేవి సరస్వతి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మీ పనితీరు సరిగ్గా లేకపోవడం వల్లే అవినీతి ఆరోపణలు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అనంతరం అర్బన్ పార్కును సందర్శించి వాకింగ్ పాత్ పనులను పరిశీలించారు. మట్టి రోడ్డు కొలతలు తీసి నాణ్యతను చెక్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వాకింగ్ పాత్ పనుల్లో అక్రమాలపై పూర్తిస్థాయి విచారణ జరిపి అధికారుల పాత్ర ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రోడ్డు పనుల్లో భాగంగా చెట్ల తొలగింపు, మట్టి తవ్వడం వంటి వాటిని పరిశీలించి అందుకు కారణమైన వారికి జరిమానా విధిస్తామని తెలిపారు. డీఎఫ్‌ఓ వెంట ఎఫ్‌ఆర్‌ఓ శ్రీదేవి సరస్వతి, బీట్, సెక్షన్ ఆఫీసర్లు ఉన్నారు.
అర్బన్ పార్కులో వాకింగ్ పాత్ పనుల కొలతలు తీస్తున్న డీఎఫ్‌ఓ జ్ఞానేశ్వర్, ఫారెస్టు అధికారులు
అధికారుల పాత్ర ఉంటే కఠిన చర్యలు: డీఎఫ్‌ఓ
అర్బన్ పార్కులో వాకింగ్ పాత్ పనుల నాణ్యత పరిశీలన
అవినీతి జలగలపై సమగ్ర విచారణ
Comments
Please login to add a commentAdd a comment