
అన్నదాతకు ‘అకాల’ నష్టం
కూలిన గూడు
బొంరాస్‌పేట: అకాల వర్షంతో ఇల్లు కూలి ఓ దళిత బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది. మండల పరిధిలోని వడిచర్లకు చెందిన గడ్డపు లాలమ్మది దళిత నిరుపేద కుటుంబం. తన కోడలు మొగులమ్మతో పాటు చిన్నారులతో కలిపి ఇంట్లో ఎనిమిది మంది ఉంటున్నారు. గత సోమవారం రాత్రి కురిసిన వర్షానికి ఇల్లు కూలిపోయింది. ఈ విషయాన్ని మంగళవారం గ్రామ కార్యదర్శి సువర్ణకు తెలియజేశారు. రేకుల తలుపుతో కాలం గడుపుతున్న తమను ఆదుకోవాలని, అధికారులు స్పందించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతున్నారు.
దుద్యాల్: రెండు రోజులుగా మండలంలో కురిసిన వడగళ్లు, అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హస్నాబాద్, ఆలేడ్, కుదురుమల్ల, దుద్యాల్, అల్లిఖాన్‌పల్లి, చెట్టుపల్లితండా, చిలుముల మైల్వార్, ఈర్లపల్లి, లగచర్ల, హకీంపేట్, పోలేపల్లి గ్రామాల్లో కురిసిన వడగండ్ల వాన చేతికొచ్చిన పంటలకు నష్టం కలిగించింది. అసలే అరకొరగా కాచిన మామిడి కాయలు నేల రాలాయి. వడ్లు సైతం రాలిపోవడంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. చిలుముల మైల్వార్ గ్రామంలో నర్సింలు, రాజు, వడ్ల ఈశ్వరయ్య గౌడ్, శేఖరయ్యగౌడ్ తదితరులకు చెందిన సుమారు వంద ఎకరాలకు పైగా పొలంలో వడ్లు రాలిపోయాయి. హస్నాబాద్‌లో మామిడి తోటలకు ఎక్కువగా నష్టం జరిగింది. ప్రభుత్వం స్పందించి పరిహారం అందించాలని బాధితులు కోరుతున్నారు.
వరి, మామిడి పంటలపై తీవ్ర ప్రభావం
నేల రాలిన కాయలు, వడ్లు
పరిహారం అందించాలని
రైతుల అభ్యర్థన

అన్నదాతకు ‘అకాల’ నష్టం

అన్నదాతకు ‘అకాల’ నష్టం
Comments
Please login to add a commentAdd a comment