విజ్ఞాన సాధన
వినూత్న బోధన
ప్రభుత్వ పాఠశాలల్లో సరికొత్త తరహా బోధనకు అడుగులు పడ్డాయి. ప్రాథమిక స్థాయి నుంచే ఏఐ ఆధారిత బోధన జరుగుతోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో వర్చువల్ రియాలిటీ విధానంలో బోధన చేసేలా విద్యాశాఖ ముందడు వేసింది. పైలెట్ ప్రాజెక్టు కింద జిల్లాలోని ఆరు పాఠశాలలను ఎంపిక చేయగా వాటిలో మూడు స్కూళ్లు దోమ మండలంలోనే ఉన్నాయి. ఏఐ ఆధారిత బోధన విజయవంతంగా అమలవుతున్న నేపథ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
దోమ: మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా విధానంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(కృత్రిమ మేధ ఏఐ)కు ప్రాధాన్యత పెరుగుతోంది. ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ఈ విధానంలో బోధన చేపట్టాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా జిల్లాలోని ఆరు పాఠశాలల్లో ఏఐ ఆధారిత బోధనను గత నెల 24నుంచి ప్రారంభించింది. జిల్లా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 5న బెంగళూరుకు చెందిన ఎక్‌స్టెప్ ఫౌండేషన్ ప్రతినిధులు మండలంలో ఏఐ బోధనా తీరును పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సామర్థ్యాలను తెలుసుకున్నారు. పిల్లలు అనర్గళంగా మాట్లాడటం, చదవడం చూసి అభినందించారు. ఇటీవల హైదరాబాద్‌లో ఏఐపై జరిగిన సదస్సులో జిల్లాలోని బొంపల్లి ప్రాథమిక పాఠశాలకు చెందిన ఆదిత్య అనే విద్యార్థి చక్కటి ప్రతిభ కనబరిచి బెస్ట్ స్టూడెండ్‌గా ఎంపికయ్యారు.
సామర్థ్యాల పెంపే లక్ష్యం
విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించడం, సామర్థ్యాల మదింపు, మార్గనిర్దేశం చేయడమే ఏఐ ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం ఎంపిక చేసిన పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఈ తరహా బోధన సాగుతోంది. పాఠ్యాంశాలను ప్రోగ్రామ్‌గా రూపొందించి అమలు చేస్తున్నారు. ఉపాధ్యాయుడు పాఠం చెప్పిన తర్వాత ఆన్‌లైన్ ద్వారా విద్యార్థులకు ప్రశ్నలు పంపుతారు. వాటికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఒక వేళ జవాబులో తప్పులుంటే సరి చేసుకునే వరకు ఏఐ టెక్నాలజీ సూచనలు చేస్తూనే ఉంటుంది.
60మంది విద్యార్థులకు..
జిల్లాలో ఏఐ ఆధారిత బోధనకు బొంపల్లి, గడిసింగాపూర్, కొడంగల్, ఎన్నారం, పుల్‌మామిడి, సాయిపూర్ ప్రాథమిక పాఠశాలలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఒక్కో పాఠశాల నుంచి 20 మంది చొప్పున ఆరు స్కూళ్ల నుంచి 120 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. ఏఐలో తొమ్మిది లెవెల్స్ ఉంటాయి. ప్రతి విద్యార్థీ ఒక్కో లెవల్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. అన్ని అంచెలు పూర్తి చేసిన వారికి బెస్ట్ స్టూడెంట్ సర్టిఫికెట్లు అందజేస్తారు.
ఇటీవల బొంపల్లి పాఠశాలలో ఏఐ ఆధారిత బోధనను పరిశీలిస్తున్న బెంగళూరు టీం సభ్యులు
పైలెట్ ప్రాజెక్టు కింద ఆరు పాఠశాలల ఎంపిక సమర్థవంతంగాఅమలు చేస్తున్న ఉపాధ్యాయులు రాష్ట్రస్థాయిలో సత్తాచాటిన బొంపల్లి విద్యార్థి భవిష్యత్తులో మరిన్ని స్కూళ్లలోఅమలయ్యే అవకాశం
విజ్ఞాన సాధన
విజ్ఞాన సాధన