
తాండూరు తైబజార్ వేలం
తాండూరు: పట్టణంలోని తైబజార్, స్లాటర్ హౌస్, బీఫ్ స్లాటర్ ఫీజు వసూలుకు శుక్రవారం వేలం పాట నిర్వహించినట్లు మున్సిపల్ కమిషనర్ విక్రంసింహారెడ్డి తెలిపారు. పట్టణానికి చెందిన కాంట్రాక్టర్ మొజమ్ రూ.10,21,500లకు తైబజార్‌ను దక్కించుకున్నారు. స్లాటర్ హౌజ్(మేకలు, గొర్రెల విక్రయించడానికి) వేలం నిర్వహించగా రూ.61 వేలకు మాజీద్ కైవసం చేసుకున్నారు. బీఫ్ స్లాటర్ హౌస్‌ను రూ.53వేలకు ఎండీ అజీమ్ ఖురేషి సొంతం చేసుకున్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ వేలం నిర్వహించినట్లు కమిషనర్ తెలిపారు.