స్టాల్స్‌లో జీసీసీ ఉత్పత్తులు, లేపాక్షి, చేనేత, హస్తకళా రూపాలు
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రంలో కళాకారుల హస్తకళా ప్రతిభకు జీ20 సభ్యదేశాలకు చెందిన ప్రతినిధులు ముగ్ధులయ్యారు. రాడిసన్ బ్లూ హోటల్‌లో ప్రారంభమైన జీ–20 సభ్యదేశాల సదస్సులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పలు స్టాళ్లు ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా గిరిజన సహకార సంస్థ(జీసీసీ) సేకరించి బ్రాండింగ్ కల్పిస్తూ మార్కెటింగ్ చేస్తున్న గిరిజన ఉత్పత్తుల స్టాల్‌తో పాటు రాష్ట్ర వైభవాన్ని ప్రస్ఫుటించే లేపాక్షి, చేనేత, హస్తకళా రూపాల స్టాల్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి. విదేశీయులకు వైభవాన్ని, గిరిజనుల కష్టాన్ని చూపించే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి జీసీసీ చైర్‌పర్సన్ శోభస్వాతిరాణి గిరిజన ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment