సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10.20 గంటలకు సీఎం విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 10.40 గంటలకు మధురవాడ ఐటీ హిల్స్ నెం.3 వద్దకు వస్తారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన ఐటీ హిల్ నెం.2కు చేరుకొని ఇన్ఫోసిస్ కార్యకలాపాల్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం ఇన్ఫోసిస్, వివిధ ఐటీ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి కాసేపు సంభాషించనున్నారు.
అనంతరం 11.55 గంటలకు బయలుదేరి హెలిప్యాడ్ వద్దకు చేరుకొని అక్కడ జీవీఎంసీ ఆధ్వర్యంలో బీచ్ క్లీనింగ్ మిషన్ ప్రారంభిస్తారు. అక్కడ నుంచి హెలికాప్టర్‌లో 12.15 గంటలకు పరవాడ చేరుకొని ఫార్మా సిటీలో గల యుజియా స్టెర్లీ ప్రైవేట్ లిమిటెడ్‌ను ప్రారంభిస్తారు. అనంతరం అచ్యుతాపురం సెజ్‌లో హెలిప్యాడ్ వద్దకు చేరుకొని.. అక్కడ మధ్యాహ్నం 1.30 నుంచి 1.45 వరకు ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు.
అక్కడి నుంచి లారెస్ ల్యాబ్‌కు చేరుకొని యూనిట్–2ను ప్రారంభిస్తారు. పరిశ్రమను సందర్శించి, కంపెనీ సీఈఓ, డైరెక్టర్లు, ఉద్యోగులతో ఇంటరాక్ట్ అవుతారు. అక్కడ నుంచి హెలికాప్టర్‌లో 3.10 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు వస్తారు. అక్కడ నుంచి 3.20 గంటలకు తిరుగు పయనమవుతారు.
Comments
Please login to add a commentAdd a comment